పట్టభద్రుల ఓటరు నమోదుపై విస్తృత అవగాహన కల్పించాలి
పట్టభద్రుల ఓటరు నమోదుపై విస్తృత అవగాహన కల్పించాలి
*ఏఈ ఆర్ ఓ, ఆర్డివో జగదీశ్వర్ రెడ్డి
కందుకూరు: మహబూబ్ నగర్, హైదరాబాద్ రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకునేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు విస్తృత అవగాహన కల్పించాలని ఏఈఆర్‌ఓ, కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి సూచించారు. గురువారం ఆర్డీఓ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఓటరు నమోదు ప్రక్రియపై చర్చించారు.
పట్టభద్రుల ఓటరు జాబితాను డీనోవో పద్ధతిలో కొత్తగా రూపొందిస్తున్నందున, గతంలో ఓటరుగా నమోదైన వారు సైతం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. అర్హులు ఫారం–18 ద్వారా అవసరమైన విద్యార్హత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటరు నమోదు ప్రక్రియపై పట్టభద్రులు, ఉద్యోగులు, యువతకు అవగాహన కల్పించి, అర్హులెవరూ అవకాశం కోల్పోకుండా రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఫారం–18 దరఖాస్తుల స్వీకరణకు నవంబర్ 6 చివరి తేదీ అని తెలిపారు.
టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్