గ్రంథాలయానికి రు.3.వేలు వితరణ చేసిన నేతల స్రవంతి
తెర్లాం, సూర్య : దో సరి గ్రామంలో తాత్కాలికంగా నిర్మాణం జరిపిన గ్రంథాలయానికి రాజా o నియోజకవర్గ జనసేన పార్టీ స్థానిక ఎన్నికల సమన్వయకర్త నేతుల స్రవంతి మూడువేల రూపాయలు వితరణ చేశారు. రాజాo నియోజకవర్గ పరిధిలో గల గ్రామాల్లో ఏ విధమైన సేవా కార్యక్రమాలు గాని సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతామని అందుకు ఎవరి ఆహ్వానించిన ఆ ఆహ్వానాన్ని మన్నించి తప్పనిసరిగా హాజరవుతామని నే తుల స్రవంతి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే మీసేన - మీసేవ సంస్థ వ్యవస్థాపకుడు గండి చిరంజీవి సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములై జనసేన పార్టీని విస్తృత పరిచే విధంగా సరైన సేవలు అందించడానికి నిరంతరం తా మిద్దరం కృషిచేస్తామని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా దోసరి గ్రామస్తులు ఆ ఇరువురి దంపతులను అభినందించారు.
రిపోర్టర్ : తిరుపతి నాయుడు, తెర్లాం, విజయనగరం జిల్లా.