ప్రత్తిపాడు: కరెంట్ సిబ్బందికి షాకిచ్చిన పాము
ప్రత్తిపాడు మండలం నడింపాలెం కొండ ప్రాంతంలో సుమారు గంటన్నర సమయం పాటు విద్యుత్ కు అంతరాయం కలగడంతో 8మంది విద్యుత్ సిబ్బంది సుమారు రెండు గంటల పాటు నలభై కిలోమీటర్ల వరకూ ఉన్న విద్యుత్ లైనుపై తనిఖీ నిర్వహించారు.చివరకు ఓ విద్యుత్ లైనుపై వేలాడుతున్న పాము వలన విద్యుత్ అంతరాయం కలిగిందని తెలుసుకొని పామును తీసివేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు విద్యుత్ శాఖ ఏ.ఇ ధర్మవరపు సాంబశివరావు వెల్లడించారు.