BREAKING
మక్కువ లో హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీల ప్రచారం ​బోగోలు మండలంలో ముమ్మరంగా ప్రచారం - జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను భారీగా గెలిపించాలంటూ ఎమ్మెల్యే ఆత్మకూరులో అదిరిన నారీభేరి ర్యాలీ --వేలాదిగా పాల్గొన్న మహిళలు బహుదా నది వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ. టిడిపి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు వెంకటేశ్వరి ఎంపిక 14 వ వార్డు లో దూసుకుపోతున్న కాకి గంగరాజు * మద్దతుగా వెలగపూడి ప్రతాపరుద్ర * నాటుసారా, అక్రమ మద్యం రవాణా నియంత్రణకు ఆంధ్రప్రదేశ్–ఒడిశా అధికారుల సమన్వయ సమావేశం అమెరికన్ బౌద్ధ భిక్షువుకు అంతర్జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పురస్కారం ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి బండి దీప్తిని భారీ మెజార్టీతో గెలిపించండి ఏయూ పరిశోధకురాలికి కేంద్ర సంగీత నాటక అకాడమీ ‘ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం’ ఏపీ ఉన్నత విద్యా ఫీజుల నియంత్రణ కమిటీ సభ్య కార్యదర్శిగా డా. ఎస్. కృష్ణయ్య నియామకం.. మూడేళ్ల పాటు డిప్యుటేషన్‌పై బాధ్యతలు అక్కంపల్లి వైసిపి, సిపిఐ ఎంపీటీసీ అభ్యర్థి గౌని శారద గెలుపు కోసం విస్తృత ప్రచారం ఏపీ నిట్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ కె.వి. కృష్ణారావు భాద్యతలు స్వీకరణ పంట నష్టాలకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం..!

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లో పోలీసుల కవాతు

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక  గ్రామాల్లో పోలీసుల కవాతు

 పొన్నూరు మేజర్ న్యూస్:-గుంటూరు జిల్లా  ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలు తో గుంటూరు జిల్లా పరిధిలో జరగనున్న ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పొన్నూరు మండలంలోని సున్నిత గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజల్లో భద్రతాభావాన్ని కల్పించేందుకు పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ కవాతు నిర్వహించారు  పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణ కోడూరు, మన్నవ గ్రామం లో పొన్నూరు రూరల్ సీఐ కృష్ణయ్య నోడల్ ఆఫీసర్ సీఐ హైమారావు మరియు పొన్నూరు రూరల్ ఎస్ ఐ వి.శ్రీహరి,చేబ్రోలు ఎస్ ఐ పర్యవేక్షణలో పొన్నూరు రూరల్ పోలీస్ సిబ్బంది, ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) బలగాల సిబ్బందితో కలిసి కవాతు నిర్వహించారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికల నియమావళి అమలు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కవాతు చేపట్టారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికల ప్రక్రియకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీసులు సూచించారు.
బ్రాహ్మణ కోడూరు గ్రామంలో పోలీస్ కవాతు ముగిసిన అనంతరం పోలీసు బలగాలు పొన్నూరు మండలంలోని మన్నవ గ్రామానికి చేరుకుని అక్కడ కూడా ఫ్లాగ్ మార్చ్ నిర్వయించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతోంది.

 పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ :- శిలార్