BREAKING
ఆత్మకూరులో అదిరిన నారీభేరి ర్యాలీ --వేలాదిగా పాల్గొన్న మహిళలు బహుదా నది వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ. టిడిపి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు వెంకటేశ్వరి ఎంపిక 14 వ వార్డు లో దూసుకుపోతున్న కాకి గంగరాజు * మద్దతుగా వెలగపూడి ప్రతాపరుద్ర * నాటుసారా, అక్రమ మద్యం రవాణా నియంత్రణకు ఆంధ్రప్రదేశ్–ఒడిశా అధికారుల సమన్వయ సమావేశం అమెరికన్ బౌద్ధ భిక్షువుకు అంతర్జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పురస్కారం ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి బండి దీప్తిని భారీ మెజార్టీతో గెలిపించండి ఏయూ పరిశోధకురాలికి కేంద్ర సంగీత నాటక అకాడమీ ‘ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం’ ఏపీ ఉన్నత విద్యా ఫీజుల నియంత్రణ కమిటీ సభ్య కార్యదర్శిగా డా. ఎస్. కృష్ణయ్య నియామకం.. మూడేళ్ల పాటు డిప్యుటేషన్‌పై బాధ్యతలు అక్కంపల్లి వైసిపి, సిపిఐ ఎంపీటీసీ అభ్యర్థి గౌని శారద గెలుపు కోసం విస్తృత ప్రచారం ఏపీ నిట్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ కె.వి. కృష్ణారావు భాద్యతలు స్వీకరణ పంట నష్టాలకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం..! ఆర్నబ్ తుఫాను ప్రభావిత పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి* రైతులకు శాస్త్రవేత్తల సూచనలు...!!

మా అభ్య‌ర్థులు మంచోళ్ల‌యితేనే ఓటు వేయండి

Select Suryaa Now
మా అభ్య‌ర్థులు మంచోళ్ల‌యితేనే ఓటు వేయండి

ముత్తుకూరు,  మేజర్ న్యూస్ :   క‌ల్తీ మ‌ద్యం పంచి అమాయ‌కుల ప్రాణాలు తీసినోళ్లు, గిరిజ‌నుల భూముల‌ను దోచుకున్నోళ్లు, అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డినోళ్లు మంచోళ్లు అనుకుంటే వారినే గెలిపించండి. కూట‌మి ప్ర‌భుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం.  స్థానిక సంస్థ‌ల బ‌లోపేతం, గ్రామాల ప్ర‌గ‌తి కోసం కూట‌మి అభ్య‌ర్థుల‌ను ఆశీర్వ‌దించాలి.   మండ‌లం పిడ‌తాపోలూరు, బ్ర‌హ్మ‌దేవం పంచాయ‌తీల్లో నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో స‌ర్వేప‌ల్లి శాస‌న‌స‌భ్యులు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి,  జెడ్పీటీసీగా నీలం ప్ర‌వీణ‌ను, ఎంపీటీసీ స‌భ్యులుగా పిడ‌తాపోలూరు -1 నాగిరెడ్డి కొండారెడ్డిని, పిడ‌తాపోలూరు -2 పేట ద్రాక్షాయణిని, బ్ర‌హ్మ‌దేవం-1దాస‌రి శ్రీనివాసులును, బ్ర‌హ్మ‌దేవం -2 పెడ‌కాల వెంక‌మ్మ‌ను గెలిపించాల‌ని సోమిరెడ్డి ప్ర‌చారం

సోమిరెడ్డి కామెంట్స్

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌ల పోలింగ్ న‌వంబ‌ర్ 5వ తేదీన జ‌ర‌గ‌నుంది. ఎన్నిక‌లు వాయిదా ప‌డ‌టంతో మేం చేస్తున్న‌ అభివృద్ధి సంక్షేమాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించేందుకు మ‌రో రెండు రోజుల స‌మ‌యం దొరికింది  మా అభ్య‌ర్థులు మంచోళ్లు అయితే సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వ‌దించండి. గోవా నుంచి తెచ్చిన రూ.10ల క‌ల్తీ మ‌ద్యం పంచి అమాయ‌కుల ప్రాణాల‌ను బ‌లితీసుకున్న వాళ్లు మంచోళ్ల‌నుకుంటే వారికే ఓటేయండి. ఆ మందు తాగి ప‌ల్లిపాడు దిబ్బ ప్రాంతానికి చెందిన అమాయ‌కులు ప్రాణాలు పోయాయి..అదే మందును చిన్న‌ప‌రెడ్డి ఎందుకు తాగ‌లేదు...తోడేరు రెడ్డి ఎందుకు తాగ‌లేదు. ఇదే క‌ల్తీ మ‌ద్యం కేసులో వీళ్ల తోటి ముద్దాయి, ఇంట‌ర్నేష‌న‌ల్ స్మ‌గ్ల‌ర్ అప్పూ జైలులోనే ప్రాణాలు కోల్పోయాడు మంచోళ్ల‌కు ఓటు వేస్తారో...దుర్మార్గాలు చేసిన వారికి వేస్తారో ప్ర‌జ‌లే నిర్ణ‌యించుకోవాలి  గిరిజ‌నుల భూముల‌ను రూ.5 వేలు, రూ,10 వేల‌కు తీసుకుని ప‌ది, ప‌దిహేను అడుగుల లోతుల గుంత‌లు తీసి మ‌ట్టి అమ్ముకుని కోట్లు గ‌డించారు అమాయ‌కుల భూముల‌ను క‌బ్జా చేసి రొయ్య‌ల గుంత‌లు వేసుకునే వారికి అండ‌గా నిలుస్తారా...ఆలోచించండి  కూట‌మి అభ్య‌ర్థుల‌తో పాటు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ, సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మంత్రి నారా లోకేష్ బాబు ను చూసి ఓట్లు వేసి ఆశీర్వ‌దించండి ఐదేళ్ల పాల‌న‌లో అవినీతి, అక్ర‌మాలు, అరాచ‌కాలు, దుర్మార్గాలు చేసిన జ‌గ‌న్ రెడ్డితో పాటు కాకాణి లాంటి వారిని చూడండి...వారు పెట్టిన అభ్య‌ర్థుల‌ను కూడా చూసి ఓటు విష‌యంలో నిర్ణ‌యం తీసుకోండి  స్థానిక సంస్థ‌ల‌కు కేంద్రం నుంచి వ‌చ్చే ఒక్క రూపాయి కూడా డైవ‌ర్ట్ చేయ‌కుండా అభివృద్ధికే ఖ‌ర్చు పెడ‌తామ‌ని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు. గ్రామాల అభివృద్ధిలో పంచాయ‌తీ, ఎంపీపీ, జెడ్పీ నిధులు కీల‌క‌మ‌వుతాయి...వీటికి కేంద్ర ఆర్థిక సంఘం నిధులు తోడ‌వుతాయి  వీటితో పాటు ఆర్అండ్‌బీ, ఇరిగేష‌న్, విద్యుత్ త‌దిత‌ర శాఖ‌ల ద్వారా వంద‌లాది కోట్లు నిధులు తెస్తున్నాం  స‌ర్వేప‌ల్లిలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ నిధుల‌తో పాటు సీఎస్ఆర్ ఫండ్ తో అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నాం  2018లో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 70 వేల ఎక‌రాల సీజేఎఫ్ఎస్ భూముల‌కు సంబంధించి డీకేటీ ప‌ట్టాలు మంజూరు చేశాం   ప్ర‌తి పేద రైతుకు యాజ‌మాన్య హ‌క్కులు క‌ల్పించ‌డంతో ఆ భూముల విలువ భారీగా పెరిగింది  స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో 7 వేల మందికి డీకేటీ ప‌ట్టాలు మంజూరు చేయించాం  ఇప్పుడు ఈ ప్ర‌భుత్వం వ‌చ్చాక బ్ర‌హ్మ‌దేవం జెన్ కో రోడ్డు సెంట‌ర్ లో ప్ర‌జ‌ల కోసం SEIL సీఎస్ఆర్ నిధులతో సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి క‌ట్టించే ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది  గ‌త విద్యాసంవ‌త్స‌రం విద్యార్థినుల‌కు 1800కి పైగా సైకిళ్లు ఇచ్చాం..ఈ ఏడాది మ‌రో 2 వేల సైకిళ్లు ఇప్పించ‌బోతున్నాం  దివ్యాంగుల‌కు ట్రైసైకిళ్లు ఒక విడ‌త ఇచ్చాం.,మ‌రో విడ‌త కూడా ఇవ్వ‌బోతున్నాం  గ్రామాల్లో అంగ‌న్ వాడీ కేంద్రాలు, క‌మ్యూనిటీ హాళ్లు నిర్మించ‌డంతో పాటు వాట‌ర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం  గిరిజ‌నుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వారి కాల‌నీల‌ను కంపెనీల‌కు ద‌త్త‌త ఇచ్చాం  వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఇలాంటి మంచి ప‌ని ఒక్క‌టైనా చేశారా....సీఎస్ఆర్ నిధులు తెచ్చారా  ఎవ‌రు మంచి చేస్తున్నారో..ఎవ‌రు చెడు చేశారో,,,ఎవ‌రు పేద‌ల భూముల‌ను దోచుకున్నారో గ‌మ‌నించి ఓటు విష‌యంలో నిర్ణ‌యం  తీసుకోవాల‌ని ఓట‌ర్ల‌ను ప్రార్థిస్తున్నాం