BREAKING
ఆత్మకూరులో అదిరిన నారీభేరి ర్యాలీ --వేలాదిగా పాల్గొన్న మహిళలు బహుదా నది వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ. టిడిపి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు వెంకటేశ్వరి ఎంపిక 14 వ వార్డు లో దూసుకుపోతున్న కాకి గంగరాజు * మద్దతుగా వెలగపూడి ప్రతాపరుద్ర * నాటుసారా, అక్రమ మద్యం రవాణా నియంత్రణకు ఆంధ్రప్రదేశ్–ఒడిశా అధికారుల సమన్వయ సమావేశం అమెరికన్ బౌద్ధ భిక్షువుకు అంతర్జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పురస్కారం ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి బండి దీప్తిని భారీ మెజార్టీతో గెలిపించండి ఏయూ పరిశోధకురాలికి కేంద్ర సంగీత నాటక అకాడమీ ‘ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం’ ఏపీ ఉన్నత విద్యా ఫీజుల నియంత్రణ కమిటీ సభ్య కార్యదర్శిగా డా. ఎస్. కృష్ణయ్య నియామకం.. మూడేళ్ల పాటు డిప్యుటేషన్‌పై బాధ్యతలు అక్కంపల్లి వైసిపి, సిపిఐ ఎంపీటీసీ అభ్యర్థి గౌని శారద గెలుపు కోసం విస్తృత ప్రచారం ఏపీ నిట్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ కె.వి. కృష్ణారావు భాద్యతలు స్వీకరణ పంట నష్టాలకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం..! ఆర్నబ్ తుఫాను ప్రభావిత పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి* రైతులకు శాస్త్రవేత్తల సూచనలు...!!

ఎకరానికి రూ 70 వేలు నష్టపరిహారం చెల్లించాలి

Select Suryaa Now
ఎకరానికి రూ 70 వేలు నష్టపరిహారం చెల్లించాలి

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన అరటి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని శాసనమండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు. గురువారం పెరవలి మండలంలోని ఖండవల్లి, ముక్కామల, కాకరపర్రు తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు. తుఫాన్ ధాటికి దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించి, రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ పెరవలి మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా చిన్న, సన్నకారు రైతులు భూములను కౌలుకు తీసుకుని అరటి పంటను సాగు చేస్తున్నారని తెలిపారు.అప్పులు చేసి, అధిక కౌలు చెల్లించి, వేలాది రూపాయల పెట్టుబడితో సాగు చేసిన అరటి తోటలు తుఫాన్ ధాటికి నేలకొరిగిపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆరుగాలం శ్రమించి పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలు రైతులను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయని అన్నారు.తుఫాన్ కారణంగా నష్టపోయిన అరటి రైతులకు ప్రభుత్వం కనీసం ఎకరానికి రూ.70 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.గతంలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా ఈ ప్రాంత రైతులకు తగిన సహాయం అందలేదని గుర్తుచేశారు. కనీసం ఈసారైనా ప్రభుత్వం రైతుల పరిస్థితిని అర్థం చేసుకుని సకాలంలో ఆదుకోవాలని కోరారు.