BREAKING
"కుండ "గుర్తును గెలిపించండి కష్టసుఖాల్లో తోడుంటా -- స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థి చాట్రాతి ప్రసాద్ బాగలేకపోతే వాళ్లే చెబుతారు.. 'ఆదర్శ కుటుంబం'పై వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు! పోక్సో చట్టంపై అవగాహనా కలిగివుండాలి - బోథ్ జడ్జి కుంభ సందీప్ ప్రత్తిపాడు: కరెంట్ సిబ్బందికి షాకిచ్చిన పాము దయచేసి అలాంటి వారు కల్ట్ మూవీ చూడొద్దు.. యంగ్ హీరో విశ్వక్ సేన్ సంచలన విజ్ఞప్తి! గ్రంథాలయానికి రు.3.వేలు వితరణ చేసిన నేతల స్రవంతి పుట్టినరోజు వేళ షిరాజ్ మెహదీ తీవ్ర ఆవేదన.. సోషల్ మీడియాలో హీరో ఎమోషనల్ పోస్ట్ వైరల్! ఎకరానికి రూ 70 వేలు నష్టపరిహారం చెల్లించాలి మా అభ్య‌ర్థులు మంచోళ్ల‌యితేనే ఓటు వేయండి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లో పోలీసుల కవాతు తల్లి వైసిపి కూతురు టిడిపి కోటసిర్లం ఎంపీటీసీ అసత్యకర పోరు దొడ్డిపట్ల గ్రామ. కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి ప్రచారం పట్టభద్రుల ఓటరు నమోదుపై విస్తృత అవగాహన కల్పించాలి రేపే 'ఆదర్శ కుటుంబం' గ్రాండ్ రిలీజ్.. 20 ఏళ్ల తర్వాత వెంకటేష్-త్రివిక్రమ్ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా! ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మోపురి సావిత్రిని గెలిపించండి.. ఇంటింటా ప్రచారం నిర్వహించిన వైఎస్ఆర్సిపి జడ్పిటిసి అభ్యర్థి

ఎమ్మెల్సీ ఓటరు నమోదు దరఖాస్తుల ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి

Select Suryaa Now
ఎమ్మెల్సీ ఓటరు నమోదు దరఖాస్తుల ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి

బోగస్ ధ్రువపత్రాలు సమర్పిస్తే.. క్రిమినల్ కేసులు నమోదు చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి

రంగారెడ్డి, మేజర్ న్యూస్ (అక్టోబర్ 29) : మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఓటరు నమోదుకు నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు, బోగస్ ధ్రువపత్రాలు సమర్పించినట్లు గుర్తిస్తే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు.

గురువారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి. నారాయణ రెడ్డితో కలిసి రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయం, శంషాబాద్ మున్సిపల్ కార్యాలయాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సందర్శించారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోసం దరఖాస్తుదారులు సమర్పించిన ఫారం-18లు, డిగ్రీ సర్టిఫికెట్లు, ఇతర విద్యార్హత ధ్రువపత్రాలను పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

ప్రతి ఫారం-18లో పొందుపరిచిన వివరాలను, దరఖాస్తుకు జత చేసిన ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటి ప్రామాణికతను నిర్ధారించాలని సి. సుదర్శన్ రెడ్డి సూచించారు. దరఖాస్తుదారుల విద్యార్హతలు, డిగ్రీ సర్టిఫికెట్లు, ఇతర సంబంధిత పత్రాలను నిశితంగా పరిశీలించాలని రాజేంద్రనగర్ ఆర్డీఓ, రాజేంద్రనగర్, శంషాబాద్ తహసీల్దార్లు, శంషాబాద్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు.

దరఖాస్తుల్లో పేర్కొన్న వివరాలకు, సమర్పించిన విద్యార్హత ధ్రువపత్రాలకు మధ్య వ్యత్యాసాలు ఉంటే వాటిని గుర్తించి అవసరమైన ధ్రువీకరణ చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. సమర్పించిన పత్రాలు అసలైనవా, సంబంధిత దరఖాస్తుదారులకు చెందినవేనా అనే విషయాలను నిర్ధారించడంతో పాటు, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఓటరు నమోదు ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు.

నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు, బోగస్ ధ్రువపత్రాలు లేదా ఇతర తప్పుడు పత్రాలతో ఓటరు నమోదుకు ప్రయత్నించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దరఖాస్తుల పరిశీలనలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ధ్రువీకరించాలని అధికారులకు సూచించారు.

ఈ పర్యటనలో రాజేంద్రనగర్ ఆర్డీఓ శ్రీధర్, తహసీల్దార్ రాములు, శంషాబాద్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ సుమన్ రావు, శంషాబాద్ తహసీల్దార్ అమరలింగం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.