BREAKING
మక్కువ లో హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీల ప్రచారం ​బోగోలు మండలంలో ముమ్మరంగా ప్రచారం - జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను భారీగా గెలిపించాలంటూ ఎమ్మెల్యే ఆత్మకూరులో అదిరిన నారీభేరి ర్యాలీ --వేలాదిగా పాల్గొన్న మహిళలు బహుదా నది వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ. టిడిపి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు వెంకటేశ్వరి ఎంపిక 14 వ వార్డు లో దూసుకుపోతున్న కాకి గంగరాజు * మద్దతుగా వెలగపూడి ప్రతాపరుద్ర * నాటుసారా, అక్రమ మద్యం రవాణా నియంత్రణకు ఆంధ్రప్రదేశ్–ఒడిశా అధికారుల సమన్వయ సమావేశం అమెరికన్ బౌద్ధ భిక్షువుకు అంతర్జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పురస్కారం ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి బండి దీప్తిని భారీ మెజార్టీతో గెలిపించండి ఏయూ పరిశోధకురాలికి కేంద్ర సంగీత నాటక అకాడమీ ‘ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం’ ఏపీ ఉన్నత విద్యా ఫీజుల నియంత్రణ కమిటీ సభ్య కార్యదర్శిగా డా. ఎస్. కృష్ణయ్య నియామకం.. మూడేళ్ల పాటు డిప్యుటేషన్‌పై బాధ్యతలు అక్కంపల్లి వైసిపి, సిపిఐ ఎంపీటీసీ అభ్యర్థి గౌని శారద గెలుపు కోసం విస్తృత ప్రచారం ఏపీ నిట్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ కె.వి. కృష్ణారావు భాద్యతలు స్వీకరణ పంట నష్టాలకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం..!

ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మోపురి సావిత్రిని గెలిపించండి.. ఇంటింటా ప్రచారం నిర్వహించిన వైఎస్ఆర్సిపి జడ్పిటిసి అభ్యర్థి

Select Suryaa Now
ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మోపురి సావిత్రిని గెలిపించండి.. ఇంటింటా ప్రచారం నిర్వహించిన వైఎస్ఆర్సిపి జడ్పిటిసి అభ్యర్థి

పులివెందుల మేజర్ న్యూస్ :

పులివెందుల మండల జెడ్పీటీసీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మోపురి సావిత్రి గురువారం మండల పరిధిలోని ఎర్రబల్లె మల్లికార్జునపురం గ్రామాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను కలుసుకుంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఆమె, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలవాలని కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గోపాల్, మాజీ మండల ఉపాధ్యక్షురాలు వీరనారాయణమ్మ, వైఎస్సార్‌సీపీ నాయకులు బాలగంగిరెడ్డి, ఉమేష్ రెడ్డి, డిష్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నల్లపురెడ్డిపల్లెలోనూ ఇంటింటా ప్రచారం
పులివెందుల మండల పరిధిలోని నల్లపురెడ్డిపల్లె గ్రామంలోనూ జెడ్పీటీసీ అభ్యర్థి మోపురి సావిత్రికి మద్దతుగా వైఎస్సార్‌సీపీ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ అజ్జుగుట్ట భాస్కర్ రెడ్డి, రామా మల్లేశ్వర రెడ్డి తదితరులు గ్రామంలోని ఓటర్లను కలిసి సావిత్రిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు రఫీ, రజాక్, మస్తాన్, పాపయ్య, ఉమారెడ్డి, రామలింగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి, గంగిరెడ్డి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

పి. కృష్ణ పులివెందుల స్టాప్ రిపోర్టర్ కడప జిల్లా