BREAKING
మక్కువ లో హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీల ప్రచారం ​బోగోలు మండలంలో ముమ్మరంగా ప్రచారం - జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను భారీగా గెలిపించాలంటూ ఎమ్మెల్యే ఆత్మకూరులో అదిరిన నారీభేరి ర్యాలీ --వేలాదిగా పాల్గొన్న మహిళలు బహుదా నది వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ. టిడిపి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు వెంకటేశ్వరి ఎంపిక 14 వ వార్డు లో దూసుకుపోతున్న కాకి గంగరాజు * మద్దతుగా వెలగపూడి ప్రతాపరుద్ర * నాటుసారా, అక్రమ మద్యం రవాణా నియంత్రణకు ఆంధ్రప్రదేశ్–ఒడిశా అధికారుల సమన్వయ సమావేశం అమెరికన్ బౌద్ధ భిక్షువుకు అంతర్జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పురస్కారం ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి బండి దీప్తిని భారీ మెజార్టీతో గెలిపించండి ఏయూ పరిశోధకురాలికి కేంద్ర సంగీత నాటక అకాడమీ ‘ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం’ ఏపీ ఉన్నత విద్యా ఫీజుల నియంత్రణ కమిటీ సభ్య కార్యదర్శిగా డా. ఎస్. కృష్ణయ్య నియామకం.. మూడేళ్ల పాటు డిప్యుటేషన్‌పై బాధ్యతలు అక్కంపల్లి వైసిపి, సిపిఐ ఎంపీటీసీ అభ్యర్థి గౌని శారద గెలుపు కోసం విస్తృత ప్రచారం ఏపీ నిట్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ కె.వి. కృష్ణారావు భాద్యతలు స్వీకరణ పంట నష్టాలకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం..!

*వరకట్న వేధింపు కేసులో భర్తకు 3 ఏళ్ల జైలు* *మధిర కోర్టులో సంచలన తీర్పు*

Select Suryaa Now
*వరకట్న వేధింపు కేసులో భర్తకు 3 ఏళ్ల జైలు*   *మధిర కోర్టులో సంచలన తీర్పు*

మధిర, సూర్య మేజర్ న్యూస్.

వరకట్న వేధింపుల కేసులో మధిర కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐదేళ్ల క్రితం నమోదైన కేసులో భర్తకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వేముల దీప్తి తీర్పునిచ్చారు. ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని మధిర పోలీస్ స్టేషన్ లో 2020 లో నమోదైన క్రైమ్ నెంబర్ 237/2020 కేసు విచారణ మంగళవారం జరిగింది. ప్రభుత్వం తరపున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్   జె. భద్రయ్య సమర్థవంతంగా వాదనలు వినిపించి, సాక్ష్యాధారాలతో నేరం రుజువు చేశారు. ముద్దాయి ఏ1- షేక్ నాగుల్ మీరాకు  ఐపీసీ 498- ఏ  కింద 2 ఏళ్లు, వరకట్న నిరోధక చట్టం సెక్షన్ 3, 4 కింద 6 నెలల చొప్పున మొత్తం 3 ఏళ్ల జైలు శిక్ష, రూ.17,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనపు జైలు శిక్ష ఉంటుందని కోర్టు పేర్కొంది. అదే కేసులో మిగిలిన A2 నుండి A4 ముద్దాయిలను అన్ని సెక్షన్ల నుండి నిర్దోషులుగా విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తీర్పుతో వరకట్న వేధింపులకు పాల్పడితే కఠిన శిక్ష తప్పదనే సంకేతం వెళ్లిందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సీతారాం…సూర్య