BREAKING
కంబాలపల్లి ఎంపీటీసీగా తిక్కమ్మనేని మంజుల ఏకగ్రీవం కూటమి పాలనలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి గండిగూడెంలో కూటమి అభ్యర్థుల ఇంటింటా ప్రచారం ఎంపీటీసీ-2 అభ్యర్థి శీలం వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ అభ్యర్థి కూరపాటి సుజాతకు మద్దతుగా ప్రచారం ఎల్నినో ప్రభావంతో నీటి పొదుపునకు ప్రాధాన్యం మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి. కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాల ఆదుకుంటుంది ఎమ్మెల్యే దగ్గుపాటి ఆధ్వర్యంలో దోపిడీ పాలన ఈస్గాం పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ అనకాపల్లి జిల్లాలో"ఆర్నాబ్" తుఫాను సహాయక చర్యల కోసం రూ. 2,05,50,000/- ముందస్తు నిధుల విడుదల తడగొండ వార్డు సభ్యుడు జగదీష్ వర్ధన్ కు జిల్లా ఉపాధ్యక్ష బాధ్యతలు సలుగుపల్లిలో వృథాగా పోతున్న మిషన్ భగీరథ నీళ్లు! - పట్టించుకోని సిబ్బంది.. దౌలాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్‌ దుర్మరణం ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే పాటించి దోమల సమాజాన్ని నిర్మిద్దాం తుఫాన్ సహాయ చర్య లో పాల్గొన్న అధికారులు దాడానగర్‌లో కొమురం భీం వర్ధంతి బంగారు, వెండి ఆభరణాల చోరీకి పాల్పడిన నిందితుడి అరెస్ట్

కళ్యాణదుర్గం నగరాన్ని సుందరంగా తీర్చి దిద్దుతాం. యస్వంత్ చౌదరి.

Select Suryaa Now
కళ్యాణదుర్గం నగరాన్ని సుందరంగా తీర్చి దిద్దుతాం. యస్వంత్ చౌదరి.

కళ్యాణదుర్గం: పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తనయుడు అమిలినేని యశ్వంత్ పేర్కొన్నారు. గురువారం కళ్యాణదుర్గం పట్టణంలోని 17, 18, 19 వార్డుల్లో కూటమి చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మీ తిమ్మరాజు, కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను కలుసుకుని కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపిస్తే పట్టణ అభివృద్ధికి మరింత కృషి చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి, పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో అమిలినేని యశ్వంత్ సమక్షంలో నారాయణ మూర్తి, నారాయణమ్మ తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.