BREAKING
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ కంబాలపల్లి ఎంపీటీసీగా తిక్కమ్మనేని మంజుల ఏకగ్రీవం కూటమి పాలనలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి గండిగూడెంలో కూటమి అభ్యర్థుల ఇంటింటా ప్రచారం ఎంపీటీసీ-2 అభ్యర్థి శీలం వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ అభ్యర్థి కూరపాటి సుజాతకు మద్దతుగా ప్రచారం ఎల్నినో ప్రభావంతో నీటి పొదుపునకు ప్రాధాన్యం మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి. కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాల ఆదుకుంటుంది ఎమ్మెల్యే దగ్గుపాటి ఆధ్వర్యంలో దోపిడీ పాలన ఈస్గాం పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ అనకాపల్లి జిల్లాలో"ఆర్నాబ్" తుఫాను సహాయక చర్యల కోసం రూ. 2,05,50,000/- ముందస్తు నిధుల విడుదల తడగొండ వార్డు సభ్యుడు జగదీష్ వర్ధన్ కు జిల్లా ఉపాధ్యక్ష బాధ్యతలు సలుగుపల్లిలో వృథాగా పోతున్న మిషన్ భగీరథ నీళ్లు! - పట్టించుకోని సిబ్బంది.. దౌలాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్‌ దుర్మరణం ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే పాటించి దోమల సమాజాన్ని నిర్మిద్దాం తుఫాన్ సహాయ చర్య లో పాల్గొన్న అధికారులు దాడానగర్‌లో కొమురం భీం వర్ధంతి

పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి పర్యటన

Select Suryaa Now
పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి పర్యటన

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం అర్నాబ్ తుపాను నేపథ్యంలో గురువారం ఉదయం రాజమహేంద్రవరం  నగరంలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విస్తృతంగా పర్యటించారు. 43, 5, 33, 41వ డివిజన్లతో పాటు ఇతర ప్రాంతాల్లో పర్యటించి తుపాను ప్రభావంతో దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను, కొనసాగుతున్న సహాయక, పునరుద్ధరణ చర్యలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తుపాను కారణంగా నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలు, కూలిన భారీ వృక్షాలను పరిశీలించి, విద్యుత్ సరఫరా పునరుద్ధరణతో పాటు రహదారులపై పడిన చెట్లను తొలగించే పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని, విద్యుత్ సరఫరాను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించాలని ఆదేశించారు. తుపాను ప్రభావంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించాలని, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలు, నేలకొరిగిన స్తంభాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. రహదారులపై కూలిన చెట్లను తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్, మున్సిపల్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ప్రజలకు అవసరమైన సేవలను నిరంతరాయంగా అందించాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకునే వరకు పునరుద్ధరణ పనులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారని పేర్కొంటూ, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సంబంధిత అధికారుల సూచనలు పాటించాలని ఎమ్మెల్యే వాసు కోరారు.