BREAKING
ఫీజుల బకాయిలు 8500 కోట్లు ఇచ్చేది ఎప్పుడు..? బీసీ నేత, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య పంట నష్టం పరిశీలించిన ఎమ్మెల్యే బండారు ఎమ్మెల్సీ ఓటరు నమోదు దరఖాస్తుల ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి అన్నూ కపూర్ కామెంట్స్‌పై తమన్నా కౌంటర్.. ‘అలాంటి వ్యాఖ్యలను అస్సలు పట్టించుకోను’! పకృతి వ్యవసాయం రైతులకు మేలు వైసీపీ నుంచి టీడీపీలోకి 100 కుటుంబాలు చేరిక రవాణా శాఖ కార్యదర్శిగా ఇలంబర్తి బాధ్యతల స్వీకరణః మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు నేలతల్లిని కాపాడుకుందాం.. సుస్థిర వ్యవసాయానికి బాటలు వేద్దాం : ఏఓ సుదర్శన్ గౌడ్ తూముకుంటలో కూటమి నేతల ఎన్నికల ప్రచారం 58వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ కంబాలపల్లి ఎంపీటీసీగా తిక్కమ్మనేని మంజుల ఏకగ్రీవం కూటమి పాలనలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి గండిగూడెంలో కూటమి అభ్యర్థుల ఇంటింటా ప్రచారం ఎంపీటీసీ-2 అభ్యర్థి శీలం వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ అభ్యర్థి కూరపాటి సుజాతకు మద్దతుగా ప్రచారం ఎల్నినో ప్రభావంతో నీటి పొదుపునకు ప్రాధాన్యం మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి.

ఆధునిక వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధించాలి: రైతులకు నిపుణుల సూచన

Select Suryaa Now
ఆధునిక వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధించాలి: రైతులకు నిపుణుల సూచన

బొంరాస్‌పేట్ ,మేజర్ న్యూస్: వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ అధిక దిగుబడులు సాధించడంతో పాటు సాగు ఖర్చులను తగ్గించుకోవాలని వ్యవసాయ నిపుణులు రైతులకు సూచించారు. వ్యవసాయ శాఖ బొంరాస్‌పేట్ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏటీఎంఏ (ATMA) ఆర్‌పీఎల్ (RPL) శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు ప్రత్యామ్నాయ వరి రకాలు, నూనె గింజల సాగు, నానో ఎరువుల వినియోగం, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (TRVK) శాస్త్రవేత్త డాక్టర్ ఉమారాజశేఖర్ పాల్గొని ఆధునిక వ్యవసాయ విధానాల గురించి వివరించారు. ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవడం, ప్రత్యామ్నాయ వరి రకాలను ప్రోత్సహించడం, నూనె గింజల పంటల సాగును విస్తరించడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. అలాగే నానో ఎరువుల వినియోగం, వాటి ప్రయోజనాలు, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై శాస్త్రీయ అవగాహన కల్పించారు.వరి సాగులో ప్రత్యామ్నాయ రకాలను ఎంచుకోవడంతో పాటు పంటల వైవిధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచించారు. వ్యవసాయంలో అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా సాగును మరింత లాభదాయకంగా మార్చుకోవచ్చని వివరించారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ నూతన సాగు పద్ధతులను అనుసరించాలని తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా రైతులకు ఆధునిక వ్యవసాయ విధానాలు, ప్రత్యామ్నాయ పంటల సాగు, ఎరువుల వినియోగంపై అవగాహన కలిగింది.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సి. కరుణాకర్ రెడ్డి, ఐసీఎం శాస్త్రవేత్త డాక్టర్ కవిరాజు, వ్యవసాయ విస్తరణ అధికారులు ఎం. స్వాతి, జి. హేమ, జి. పవన్, జి. సాయి తేజ, కె. భావనతో పాటు బొంరాస్‌పేట్ గ్రామానికి చెందిన రైతులు పాల్గొన్నారు.

రిపోర్టర్: శ్రీశైలం, బొంరాస్ పేట్, వికారాబాద్ జిల్లా.