పంట నష్టం పరిశీలించిన ఎమ్మెల్యే బండారు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంమండలంలోని కొమరాజులంక, పొడగట్లపల్లి గ్రామాల్లో నేలకొరిగిన అరటి తోటలను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పరిశీలించారు. దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, బాధిత రైతులతో మాట్లాడి వారికి జరిగిన నష్టం, ఎదుర్కొంటున్న ఇబ్బందుల వివరాలను తెలుసుకున్నారు.పంట నష్టంపై సమగ్ర అంచనా వేసి, బాధిత రైతుల వివరాలను సంబంధిత అధికారులు సేకరించాలని ఎమ్మెల్యే సూచించారు. నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించే అంశంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తావని హామీ ఇచ్చారు .