BREAKING
కొమురం భీమ్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా పలు గ్రామాల్లో కేతి బచాఓ అవగాహన కార్య క్రమాలు రైతులకు నష్ట నివారణకు సూచనలు రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు ప్రజలందరూ ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ద వహించాలి జిల్లా కలెక్టర్ రాజర్షిషా వీబీజీ రామ్‌జీ పనులను పరిశీలించిన ఎంపీడీవో వచ్చే ఏడాది మార్చికి రైల్వే కోచ్ వర్క్ షాప్ ఫ్యాక్టరీ ప్రారంభం... ఎంపీ బస్తిపాటి నాగరాజు 33, 34వ వార్డుల్లో సైకిల్ గుర్తుకు ఓటేయండి జీఎంపీవీఎస్ సిద్దిపేట, జనగామ జిల్లాల ఇంచార్జిగా అందె అశోక్ చేర్యాల వెంకటసాయి ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స ఎసిబి వలలో మోసం గ్రామ పంచాయతీ జీపీఓ శ్రీనివాస్ నందివాడలో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి పేయ్యల అశోక్ విస్తృత ప్రచారం ఆధునిక వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధించాలి: రైతులకు నిపుణుల సూచన నషా ముక్త్ భారత్ తోనే ఆరోగ్యవంతమైన సమాజం -ఎంపీ డికే అరుణ నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం చేస్తాం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

పారిశుద్ధ్య చర్యలు వేగవంతం చేయాలి

Select Suryaa Now
పారిశుద్ధ్య చర్యలు వేగవంతం చేయాలి

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంనగరంలో పారిశుధ్య చర్యలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. గురువారం ఉదయం హైటెక్ బస్టాండ్, డీలక్స్ సెంటర్, రైల్వే స్టేషన్ రోడ్డు సహా పలు ప్రాంతాలలో పర్యటించారు. రోడ్లపై నిలిచిన నీటిని, ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం కలగకుండా మోటర్ల సాయంతో తొలగించాలన్నారు. అలాగే వాహనదారులు, పాదచారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాయంత్రం లోపు రహదారులపై ఉన్న చెట్ల కొమ్మలు, వ్యర్థాలను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. అనంతరం క్వారీ మార్కెట్ లోని వెహికల్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా యార్డులో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, మూవ్ మెంట్ రిజిస్టర్ ను పరిశీలించారు. ప్రస్తుతం ఎన్ని వాహనాలు వినియోగంలో ఉన్నది. ఎంత మంది డ్రైవర్లు అందుబాటులో ఉన్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాహనాల కండిషన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని.. మరమ్మతులు ఉన్నట్లయితే వెంటనే చేయించి వారం రోజుల్లోగా వాహనాలన్నింటినీ పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం నల్లా ఛానల్, ఎన్ఆర్సీపీ పంపింగ్ స్టేషన్ లను పరిశీలించారు. ఆయన వెంట శానిటరీ సూపర్ వైజర్ శ్రీనివాస్, ఇతర సిబ్బంది ఉన్నారు.