33, 34వ వార్డుల్లో సైకిల్ గుర్తుకు ఓటేయండి
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి కృష్ణమూర్తితో పాటు 34వ వార్డు అభ్యర్థి కీర్తి జావిద్, 33వ వార్డు అభ్యర్థి ఉషారాణి ప్రకాష్‌కు మద్దతుగా పార్టీ శ్రేణులు ప్రచారం నిర్వహిస్తున్నాయి. వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.మున్సిపాలిటీ అభివృద్ధి, వార్డుల్లో నెలకొన్న స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ప్రచారంలో వివరిస్తున్నారు. ఈ సందర్భంగా 33, 34వ వార్డుల ఓటర్లు సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఉషారాణి ప్రకాష్, కీర్తి జావిద్‌లను గెలిపించాలని కోరారు. అలాగే చైర్‌పర్సన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి కృష్ణమూర్తికి కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్