BREAKING
YELP వార్షిక పురస్కారాలు 31న - సిద్ధమైన ది ఎర్త్ సెంటర్.. 2030 ఫ్రెంచ్ ఆల్ప్స్ వింటర్ ఒలింపిక్స్ బాధ్యతలు బంగ్లా లో ఉన్నది అసలైన టీడీపీ కాదు...... * మాజీ కౌన్సిలర్ రొంగలి రామారావు * ఆయిల్‌పామ్ తోటల పరిశీలన.. రైతులతో కలెక్టర్ ముఖాముఖి సోరియాసిస్ అనేది అంటువ్యాధి కాదు.. బాధితుల పట్ల సామాజిక వివక్ష తగదు - డాక్టర్ దాసరి చంద్రశేఖర్ లిథువేనియాలో స్టార్‌లింక్ బేస్ స్టేషన్‌పై దాడి కేసులో తీవ్ర పరిణామాలు జోరుగా కూటమి అభ్యర్థుల ప్రచారం -- గడ్డమణుగు రవి కుమార్ ఆధ్వర్యంలో దమ్ముంటే కోలగట్ల పై ఏ కేసులు ఉన్నాయో నిరూపించండి.... * 3 రోజుల్లో నిరూపిస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటా * ప్రధాని పెడ్రో సాంచెజ్ ఎన్నికల ప్రచారానికి భారీ ఎదురుదెబ్బ! ప్రచారంలో వైసీపీ దూకుడు.. బిట్‌-2లో వాకాటి సంధ్య జోరు! జడ్పిటిసి,ఎంపిటిసి గెలుపు లక్ష్యంగా రాగోలు,గోలగాం గ్రామాలలో విస్తృతంగా ప్రచారం పీఎం శ్రీ బాలుర పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఎంపిక లెనిన్ పాండియన్’ రివ్యూ: పిట్ట కొంచం కూత ఘనం.. అలరించే కామెడీ థ్రిల్లర్! పొటాష్ లోప నివారణకు జిల్లేడు ద్రావణం తయారీ తెలంగాణ కళాకారుల హక్కుల సాధనే లక్ష్యంగా తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ

వైసీపీకి గట్టి షాక్.. టీడీపీలోకి చేరికలు

Select Suryaa Now
వైసీపీకి గట్టి షాక్.. టీడీపీలోకి చేరికలు

 

ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి 
గోనెగండ్ల మండలం చిన్నమారివీడు గ్రామంలో వైఎస్సార్‌సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ సర్పంచ్ బోయ చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీ బసప్పతో పాటు చంద్ర, దొరబాబు, రామచంద్ర, భూపాల్, విద్యాసాగర్, అరవింద్ తదితరులు తమ సుమారు 80 మంది అనుచరులతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీలో చేరిన వారికి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు నూతనంగా పార్టీలో చేరిన నాయకులు తెలిపారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయానికి తమ వంతు కృషి చేస్తామని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వారు వెల్లడించారు.చిన్నమారివీడులో టీడీపీలోకి భారీ చేరికలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
A. R. శరత్ కుమార్ సూర్య ప్రతినిధి ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా