BREAKING
కంపసముద్రంలో పోలేరమ్మ గుడి శంకుస్థాపన శ్రీకాకుళం తీరప్రాంత పరిరక్షణకు పెద్దపీట.. * నష్టపోయిన ప్రతి రైతుకూ అండగా నిలుస్తాం * ఆత్మకూరులో నేడే తెలుగుదేశం, ఎన్ డి ఏ కూటమి ర్యాలీ - రండి.. కదలిరండి.. తరలిరండి... ఎన్నికల నిర్వహణపై సమీక్ష మధ్యవర్తిత్వంతో పెండింగ్ కేసులకు సత్వర పరిష్కారం కూలిన భారీ వృక్షం. స్పందించిన రెవిన్యూ శాఖ * పోలీస్,ఎన్డీఆర్ఎఫ్, ఆర్ అండ్ బి సహకారంతో * ​డాక్టర్‌ పాదర్తి నాగరాజుకు ‘జాతీయ ఉత్తమ జర్నలిస్టు’ పురస్కారం. విదేశాల్లో పుట్టిన వారికి చైర్మన్ పదవా? విచారణ జరపాలి. కావలి డిఎస్‌పి కార్యాలయంలో ఘనంగా రక్తదాన శిబిరం. మల్లన్నసాగర్ కట్టకింద భారీ బ్లాస్టింగ్ 35 వేల ఎకరాల్లో పంట నష్టం.. రైతులకు అండగా కూటమి ప్రభుత్వంప్రతిపక్షాల విమర్శలు విడ్డూరం : ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మక్కువ లో హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీల ప్రచారం ​బోగోలు మండలంలో ముమ్మరంగా ప్రచారం - జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను భారీగా గెలిపించాలంటూ ఎమ్మెల్యే ఆత్మకూరులో అదిరిన నారీభేరి ర్యాలీ --వేలాదిగా పాల్గొన్న మహిళలు బహుదా నది వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ.

జోరుగా కూటమి అభ్యర్థుల ప్రచారం -- గడ్డమణుగు రవి కుమార్ ఆధ్వర్యంలో

Select Suryaa Now
జోరుగా కూటమి అభ్యర్థుల ప్రచారం  -- గడ్డమణుగు రవి కుమార్ ఆధ్వర్యంలో

జీలుగుమిల్లి, మేజర్ న్యూస్:జీలుగుమిల్లి లో కూటమి పార్టీల నాయకులు గడ్డమణుగు రవికుమార్, పసుపులేటి రాము, సుంకువల్లి సాయి ఆధ్వర్యంలో   ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులతో గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేస్తూ తమ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. గురువారం స్థానిక గ్రేస్ మందిర్ చర్చి వద్ద బ్రదర్ ఎజ్రా శాస్త్రి ని కలిసిన కూటమి పార్టీ నాయకులు కూటమి అభ్యర్థులకు సహకరించి ఓటు వేసి గెలిపించాలని కోరారు.  జీలుగుమిల్లి ఎంపీటీసీ అభ్యర్థిని కారం సుజాత, జడ్పీటీసీ అభ్యర్థి కుంజా నాగమణి ఇంటింటా పర్యటిస్తూ ఓటర్లను తమకు ఓటు వేయాలని కోరారు.ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తూ, వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఎన్నికల్లో ప్రజల మద్దతు కోరుతూ ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలుసుకోవడం పై దృష్టి సారించినట్లు చెప్పారు. ఈ ప్రచారంలో నాయకులు పసుపులేటి ప్రసాద్,  కోల మధు, చిర్రి శ్రీను, ఉలవల శివ, డేవిడ్ రాజు,  యువ మోర్చా జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కక్కిరాల మురళి, యువ మోర్చా దారా మధు తదితరులు పాల్గొన్నారు.

 రిపోర్టర్ బొంతు రామకృష్ణ జీలుగుమిల్లి ఏలూరు జిల్లా