BREAKING
రాష్ట్ర పండుగను తలపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం.. అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన స్విట్జర్లాండ్ బయోటెక్ దిగ్గజం మాలిక్యులర్ పార్టనర్స్ సంచలన నిర్ణయం ఫోక్స్‌వ్యాగన్‌కు భారత్‌లో రూ. 12 వేల కోట్ల భారీ పన్ను వివాదంపై హైకోర్టులో కొత్త మలుపు! తగ్గేదేలే...! *కార్పొరేషన్ లో పెరిగిన హీట్ గ్రామాల్లో శిక్షణ డిప్యూటీ కలెక్టర్ పరిశీలన ఎన్విడియాకు దీటుగా గూగుల్ ఏఐ చిప్స్ మంథని పుష్కర ఘాట్‌కు రూ.23 కోట్లు ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం స్వతంత్ర అభ్యర్థికి భారీగా మహిళల మద్దతు... బీరువా గుర్తుకే జై కొడుతున్న మహిళా లోకం ఫ్రాన్స్‌ దేశంలో జాత్యహంకారాన్ని ప్రోత్సహిస్తోందంటూ మితవాద పార్టీలపై ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఆగ్రహం! ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతులు ఇటలీలో వాహనదారులకు వ్యక్తిగతీకరించిన నెంబర్ ప్లేట్ల వెసులుబాటు కల్పించిన ప్రధాని మెలోనీ! గొట్టల గడ్డ తాండలో హనుమాన్ దేవాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం గ్రామాల్లో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి విస్తృత ప్రచారం

ఎన్నికల నిర్వహణపై సమీక్ష

Select Suryaa Now
ఎన్నికల నిర్వహణపై సమీక్ష

 

బాపట్ల, మేజర న్యూస్ :  జిల్లా కలెక్టర్ మరియు  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్  వినోద్ కుమార్,వి., ఆదేశాల మేరకు రెండో విడత సాధారణ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నవంబర్ 5న జిల్లాలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ విధులు నిర్వహించే ప్రిసైడింగ్ అధికారులు (పీఓలు), సహాయ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీఓ)లకు గురువారం పట్టణ పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో రెండో విడత శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

ఈ శిక్షణలో పోలింగ్ రోజు చేపట్టాల్సిన విధులు, పోలింగ్ కేంద్రంలో అనుసరించాల్సిన ఎన్నికల నిబంధనలు, ఓటింగ్ ప్రక్రియ నిర్వహణ, పోలింగ్ సామగ్రి వినియోగం, ఎన్నికల సంబంధిత రికార్డుల నిర్వహణ, పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని సంబంధిత అధికారులకు అప్పగించే విధానాలపై అధికారులు శిక్షణ అందించారు.
ఎన్నికల విధులపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ, పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని శిక్షణలో సూచించారు.మాస్టర్ ట్రైనర్లు జి. ఉదయ్ శంకర్, సీహెచ్. బాలకోటేశ్వరరావు బ్యాలెట్ బాక్సుల నిర్వహణ, వివిధ కవర్లు, ఎన్నికల ఫారాలు పూర్తి చేసే విధానాలను క్షుణ్ణంగా వివరించారు.

ఈ కార్యక్రమంలో బి.సి.సంక్షేమ శాఖ మరియు బాపట్ల  మండల ఆర్ ఓ శివలీల,  ఎంఇఓ ఎస్ నిరంజన్,పి ఓ లు,ఏ పి ఓ లు తదితరులు పాల్గొన్నారు.