డాక్టర్ పాదర్తి నాగరాజుకు ‘జాతీయ ఉత్తమ జర్నలిస్టు’ పురస్కారం.
కావలి మేజర్ న్యూస్ : జర్నలిజం రంగంలో విశేష సేవలందిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న డాక్టర్ పాదర్తి నాగరాజు ప్రతిష్టాత్మక "జాతీయ ఉత్తమ జర్నలిస్టు పురస్కారం - 2026"ను అందుకున్నారు. నెల్లూరు హాస్పిటల్ ఆడిటోరియంలో 'ఎం.వి. రావు ఫౌండేషన్' ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన పురస్కారాల ప్రదానోత్సవంలో అడిషనల్ ఎస్పీ, పలువురు ప్రముఖుల చేతుల మీదుగా ఆయన ఈ సన్మానాన్ని స్వీకరించారు. జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో అతిథులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభమైన పత్రికారంగంలో విలువలతో కూడిన జర్నలిజం సమాజానికి ఎంతో అవసరమని, ప్రజాపక్షాన నిలిచే పాత్రికేయులను ప్రోత్సహించడం అభినందనీయమని కొనియాడారు. డాక్టర్ నాగరాజుకు జాతీయ స్థాయి పురస్కారం లభించడం పట్ల పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు, ప్రజాసంఘాల నాయకులు, వాసవి క్లబ్ ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.