BREAKING
వడ్డీ రేట్ల కంటే ఫ్రాన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం దివ్యాంగ విద్యార్థులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు రాజకీయ లబ్ధి కోసమే ఈటల పాదయాత్ర: డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్‌ యాదవ్‌ క్లోరెక్స్ కొత్త సీఈఓగా యూనిలీవర్ మాజీ ఎగ్జిక్యూటివ్ పర్యావరణ పునరుద్ధరణ చర్యలను వేగవంతం చేయాలి రాష్ట్ర పండుగను తలపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం.. అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన స్విట్జర్లాండ్ బయోటెక్ దిగ్గజం మాలిక్యులర్ పార్టనర్స్ సంచలన నిర్ణయం ఫోక్స్‌వ్యాగన్‌కు భారత్‌లో రూ. 12 వేల కోట్ల భారీ పన్ను వివాదంపై హైకోర్టులో కొత్త మలుపు! తగ్గేదేలే...! *కార్పొరేషన్ లో పెరిగిన హీట్ గ్రామాల్లో శిక్షణ డిప్యూటీ కలెక్టర్ పరిశీలన ఎన్విడియాకు దీటుగా గూగుల్ ఏఐ చిప్స్ మంథని పుష్కర ఘాట్‌కు రూ.23 కోట్లు ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం స్వతంత్ర అభ్యర్థికి భారీగా మహిళల మద్దతు... బీరువా గుర్తుకే జై కొడుతున్న మహిళా లోకం

ఆత్మకూరులో నేడే తెలుగుదేశం, ఎన్ డి ఏ కూటమి ర్యాలీ - రండి.. కదలిరండి.. తరలిరండి...

Select Suryaa Now
ఆత్మకూరులో నేడే తెలుగుదేశం, ఎన్ డి ఏ కూటమి ర్యాలీ - రండి.. కదలిరండి.. తరలిరండి...

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :  ఆత్మకూరు పురపాలక ఎన్నికల సందర్భంగా అక్టోబర్ 30వతేదీ శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహిస్తామని టిడిపి నాయకులు పేర్కొన్నారు.  రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ–ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలో భారీ  ర్యాలీ, పాదయాత్ర నిర్వహించేందుకు నిర్ణయించామన్నారు.  నవంబర్ 1న జరగనున్న పురపాలక ఎన్నికల్లో  ఆనం రామనారాయణ రెడ్డి  బలపరచిన తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా ప్రముఖ ప్రజావైద్యులు, మాజీ శాసనసభ్యులు డాక్టర్ బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి గారి కోడలు, దివంగత నేత బొమ్మిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారి సతీమణి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా  పోటీ చేయుచున్నారని,అలాగే ఎన్నికల బరిలోని 27 వార్డుల మున్సిపల్ కౌన్సిలర్లుగా పోటీ చేయు అభ్యర్ధులను భారీ మెజారిటీ తో గెలిపించవలసినదిగా కోరుతూ ఆత్మకూరు పట్టణ ప్రజల ఆశీర్వాదం కోరుతూ  భారీ ర్యాలీ ఏర్పాటు చేయబడిందన్నారు.
శుక్రవారంఉదయం 9:00 గంటల నుండి
మున్సిపల్ ఆఫీసు ప్రాంగణం సెంటర్ నుండి 
పాత మున్సిపల్ బస్టాండ్ సెంటర్ వరకు 
ర్యాలీ జరుగుతుందన్నారు.మున్సిపల్ ఆఫీసు ప్రాంగణం సెంటర్,పోలీస్ స్టేషన్ సెంటర్, సోమశిల రోడ్ సెంటర్, బి ఎస్ ఆర్ సెంటర్, హిల్ రోడ్ మున్సిపల్ బస్టాండ్ సెంటర్  వరకు జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి  ఆనం రామనారాయణరెడ్డి ,నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తో పాటు మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా , అన్నివార్డుల అభ్యర్థులు, ఎన్డీయే కూటమి నాయకులు పాల్గొంటారన్నారు.  కావున తెలుగుదేశం పార్టీ–ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పట్టణ ప్రజలు ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొని దీవించాలని వారు కోరారు.