BREAKING
కంపసముద్రంలో పోలేరమ్మ గుడి శంకుస్థాపన శ్రీకాకుళం తీరప్రాంత పరిరక్షణకు పెద్దపీట.. * నష్టపోయిన ప్రతి రైతుకూ అండగా నిలుస్తాం * ఆత్మకూరులో నేడే తెలుగుదేశం, ఎన్ డి ఏ కూటమి ర్యాలీ - రండి.. కదలిరండి.. తరలిరండి... ఎన్నికల నిర్వహణపై సమీక్ష మధ్యవర్తిత్వంతో పెండింగ్ కేసులకు సత్వర పరిష్కారం కూలిన భారీ వృక్షం. స్పందించిన రెవిన్యూ శాఖ * పోలీస్,ఎన్డీఆర్ఎఫ్, ఆర్ అండ్ బి సహకారంతో * ​డాక్టర్‌ పాదర్తి నాగరాజుకు ‘జాతీయ ఉత్తమ జర్నలిస్టు’ పురస్కారం. విదేశాల్లో పుట్టిన వారికి చైర్మన్ పదవా? విచారణ జరపాలి. కావలి డిఎస్‌పి కార్యాలయంలో ఘనంగా రక్తదాన శిబిరం. మల్లన్నసాగర్ కట్టకింద భారీ బ్లాస్టింగ్ 35 వేల ఎకరాల్లో పంట నష్టం.. రైతులకు అండగా కూటమి ప్రభుత్వంప్రతిపక్షాల విమర్శలు విడ్డూరం : ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మక్కువ లో హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీల ప్రచారం ​బోగోలు మండలంలో ముమ్మరంగా ప్రచారం - జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను భారీగా గెలిపించాలంటూ ఎమ్మెల్యే ఆత్మకూరులో అదిరిన నారీభేరి ర్యాలీ --వేలాదిగా పాల్గొన్న మహిళలు బహుదా నది వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ.

బంగ్లా లో ఉన్నది అసలైన టీడీపీ కాదు...... * మాజీ కౌన్సిలర్ రొంగలి రామారావు *

Select Suryaa Now
బంగ్లా లో ఉన్నది   అసలైన టీడీపీ కాదు......  * మాజీ కౌన్సిలర్  రొంగలి రామారావు *

విజయనగరం బ్యూరో, సూర్య :  జిల్లాలో టిడిపి రాజకీయాలు చిత్ర విచిత్రంగా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ రొంగలి రామారావు అన్నారు. గురువారం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిడిపి ఏర్పాటుకు ముందు సునీలా గజపతిరాజు చైర్మన్ గా ఉన్నప్పుడు వైస్ చైర్మన్ గా ప్రసాదాల రామకృష్ణ ఆమెని పదవి నుంచి తొలగించడానికి అవిశ్వాసం పెట్టలేదా ! అన్నారు, ఆ తరువాత పార్టీ మారి తెలుగు దేశం లోకి వచ్చిన తర్వాత నాలుగు సార్లు చైర్మన్ పదవికి పోటీ చేస్తే మూడుసార్లు గెలిచి చైర్మన్ పదవి అనుభవించలేదా అన్నారు.   అదేవిధంగా గురనా వారు    పార్టీ నుంచి బయటకు వచ్చి పోటీ చేయలేదా అన్నారు.  ఆ తరువాత ప్రజారాజ్యంలో ఉన్న మీసాల గీతను టిడిపిలోకి ఆహ్వానించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించలేదా అన్నారు. అవనాపు  సూరిబాబు గతంలో రెండున్నర సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ గా చేశారన్నారు ఆయన కుమారులు కాంగ్రెస్ ,వైసీపీ నుంచి టిడిపిలో చేరి ఇప్పుడు మేయర్ అభ్యర్థిగా ఆయన కోడలు అవనాపు భార్గవికి పోటీ చేయడానికి అవకాశం ఇవ్వలేదా అని మండపడ్డారు. టిడిపి పార్టీ లో ఇప్పుడు పదవులు, టిక్కెట్లు పార్టీలు మారుతూ వస్తున్నవారకే  ఇస్తున్నారని దుయ్యబట్టారు. కోట్లాది, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని , గత 40 సంవత్సరాలుగా పార్టీనే నమ్ముకుని ఉంటున్న వాళ్లకి పార్టీ టికెట్లు ఇవ్వకుండా ఇప్పటికిప్పుడు వైసీపీ నుంచి వచ్చిన వైసీపీ అభ్యర్థులకు టిడిపి టికెట్లు ఇచ్చి కార్పొరేట్ అభ్యర్థులుగా ప్రకటించడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు నాటి నుంచి పార్టీ లో మాజి కేంద్ర మంత్రి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు గోవా గవర్నర్  అశోక్ గజపతిరాజు తో ఉన్న నాయకులను పక్కన పెడుతున్నట్లు వాళ్లని అణగదొక్కడానికి బంగ్లాలో ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది గట్టిగా వినిపిస్తుందన్నారు. ఇప్పుడు ఏకంగా వైసిపి నుంచి పార్టీలో చేరిన ఏడుగురు అభ్యర్థులకు కార్పొరేటర్ అభ్యర్థులుగా టికెట్లు కేటాయించడం ఇందుకు నిదర్శనం అన్నారు. టిడిపి బంగ్లా పేరు మార్చి ఇక పై వై టిడిపి బంగ్లా అని బోర్డు పెట్టాలన్నారు. జిల్లాలో త్వరలోనే టిడిపి నే నమ్ముకుని ఆ పార్టీ జెండా మూసి ఆ కండువానే ప్రాణంగా భావించి టిడిపిలో ఉన్న నాయకులు కోసం స్వచ్ఛమైన టిడిపి కార్యాలయాన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. త్వరలో టీడీపీ పరిరక్షణ యాత్ర చేపడతామన్నారు .ఇప్పుడు బంగ్లాను ఏలుతున్న మండల టిడిపి నాయకులు గంటా పోలినాయుడు,పాశి అప్పలనాయుడు,బొద్ధల నర్సింగరావు,ఈగల సత్తి బాబు వంటి వారు వైసీపీ నుంచి వచ్చిన వారు కాదా అని ప్రశ్నించారు. బంగ్లాలో ఏళ్ల తరబడి చెట్టు కింద కూర్చున్న వాళ్లకి నీడే తప్ప పదవులు ఉండవని మండిపడ్డారు. పార్టీ నీ నమ్ముకున్న సీనియర్లకు కన్నీరే మిగిలిందని అవేదన వ్యక్తం చేశారు.కూటమి అభ్యర్థులను ఓడించి బుద్ధి చెప్పాలని కోరారు.

రిపోర్టర్ :  డేవిడ్ రాజు, విజయనగరం.