BREAKING
కంపసముద్రంలో పోలేరమ్మ గుడి శంకుస్థాపన శ్రీకాకుళం తీరప్రాంత పరిరక్షణకు పెద్దపీట.. * నష్టపోయిన ప్రతి రైతుకూ అండగా నిలుస్తాం * ఆత్మకూరులో నేడే తెలుగుదేశం, ఎన్ డి ఏ కూటమి ర్యాలీ - రండి.. కదలిరండి.. తరలిరండి... ఎన్నికల నిర్వహణపై సమీక్ష మధ్యవర్తిత్వంతో పెండింగ్ కేసులకు సత్వర పరిష్కారం కూలిన భారీ వృక్షం. స్పందించిన రెవిన్యూ శాఖ * పోలీస్,ఎన్డీఆర్ఎఫ్, ఆర్ అండ్ బి సహకారంతో * ​డాక్టర్‌ పాదర్తి నాగరాజుకు ‘జాతీయ ఉత్తమ జర్నలిస్టు’ పురస్కారం. విదేశాల్లో పుట్టిన వారికి చైర్మన్ పదవా? విచారణ జరపాలి. కావలి డిఎస్‌పి కార్యాలయంలో ఘనంగా రక్తదాన శిబిరం. మల్లన్నసాగర్ కట్టకింద భారీ బ్లాస్టింగ్ 35 వేల ఎకరాల్లో పంట నష్టం.. రైతులకు అండగా కూటమి ప్రభుత్వంప్రతిపక్షాల విమర్శలు విడ్డూరం : ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మక్కువ లో హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీల ప్రచారం ​బోగోలు మండలంలో ముమ్మరంగా ప్రచారం - జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను భారీగా గెలిపించాలంటూ ఎమ్మెల్యే ఆత్మకూరులో అదిరిన నారీభేరి ర్యాలీ --వేలాదిగా పాల్గొన్న మహిళలు బహుదా నది వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ.

ఆయిల్‌పామ్ తోటల పరిశీలన.. రైతులతో కలెక్టర్ ముఖాముఖి

Select Suryaa Now
ఆయిల్‌పామ్ తోటల పరిశీలన.. రైతులతో కలెక్టర్ ముఖాముఖి

సూర్య వీణవంక : కరీంనగర్ జిల్లా:
కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా వీణవంక మండలంలోని పలు ఆయిల్‌పామ్ తోటలను సందర్శించి పంట సాగు విధానం, దిగుబడి, పెట్టుబడి ఖర్చులు, రైతులకు కలుగుతున్న ఆదాయం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి పంట సాగులో ఎదురవుతున్న సమస్యలు, నిర్వహణకు అవుతున్న ఖర్చులు, ఎరువులు, పురుగుమందుల వినియోగం, పంట దిగుబడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.రాబోయే ఏలినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులకు ముందస్తు వ్యవసాయ సూచనలు అందించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. అధిక వర్షాలు, నీరు నిల్వ ఉండటం వల్ల పంటలకు కలిగే నష్టాలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పొలాల్లో నీటి పారుదల సౌకర్యాలు, పంటల సంరక్షణ, తెగుళ్ల నివారణ వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.గ్రామాల్లో రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, పంటల సాగు నుంచి దిగుబడుల వరకు అవసరమైన సాంకేతిక సలహాలు అందించాలని అధికారులకు సూచించారు.
జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులతో నేరుగా మాట్లాడటం ద్వారా వ్యవసాయ రంగంలో వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడంతోపాటు, రైతులకు మెరుగైన సాగు పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ పర్యటన ప్రాధాన్యతను చాటిచెప్పింది.