BREAKING
వెటర్నరీ కళాశాలలో మొక్కలు నాటిన రెడ్ క్రాస్ ప్రతినిధులు చినమాచనూరులో టిడిపి ప్రచార జోరు కంపసముద్రంలో పోలేరమ్మ గుడి శంకుస్థాపన శ్రీకాకుళం తీరప్రాంత పరిరక్షణకు పెద్దపీట.. * నష్టపోయిన ప్రతి రైతుకూ అండగా నిలుస్తాం * ఆత్మకూరులో నేడే తెలుగుదేశం, ఎన్ డి ఏ కూటమి ర్యాలీ - రండి.. కదలిరండి.. తరలిరండి... ఎన్నికల నిర్వహణపై సమీక్ష మధ్యవర్తిత్వంతో పెండింగ్ కేసులకు సత్వర పరిష్కారం కూలిన భారీ వృక్షం. స్పందించిన రెవిన్యూ శాఖ * పోలీస్,ఎన్డీఆర్ఎఫ్, ఆర్ అండ్ బి సహకారంతో * ​డాక్టర్‌ పాదర్తి నాగరాజుకు ‘జాతీయ ఉత్తమ జర్నలిస్టు’ పురస్కారం. విదేశాల్లో పుట్టిన వారికి చైర్మన్ పదవా? విచారణ జరపాలి. కావలి డిఎస్‌పి కార్యాలయంలో ఘనంగా రక్తదాన శిబిరం. మల్లన్నసాగర్ కట్టకింద భారీ బ్లాస్టింగ్ 35 వేల ఎకరాల్లో పంట నష్టం.. రైతులకు అండగా కూటమి ప్రభుత్వంప్రతిపక్షాల విమర్శలు విడ్డూరం : ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మక్కువ లో హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీల ప్రచారం ​బోగోలు మండలంలో ముమ్మరంగా ప్రచారం - జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను భారీగా గెలిపించాలంటూ ఎమ్మెల్యే

YELP వార్షిక పురస్కారాలు 31న - సిద్ధమైన ది ఎర్త్ సెంటర్..

Select Suryaa Now
YELP వార్షిక పురస్కారాలు 31న - సిద్ధమైన ది ఎర్త్ సెంటర్..

*కడ్తాల్, రంగారెడ్డి 

 

కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ (CGR), తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులను బాల్యం నుండే పర్యావరణ నాయకులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రాం (YELP) 2025-26 వార్షిక పురస్కారాల ప్రదానోత్సవం అక్టోబర్ 31న రంగారెడ్డి జిల్లా, కడ్తాల్ మండలంలోని ది ఎర్త్ సెంటర్‌లో నిర్వహించనున్నట్లు CGR అధ్యక్షురాలు లీలా లక్ష్మారెడ్డి తెలిపారు.

2025-26లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక పాఠశాలల్లో YELP ను విజయవంతంగా అమలు చేశామని, NSE-SSC, SEBI, NABARD సంస్థలు సహకారం అందించాయన్నారు. విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్యం, నీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ, సేంద్రీయ వ్యవసాయం, బయో ఎంజైమ్, విత్తన బంతుల తయారీపై ప్రత్యక్ష శిక్షణ ఇచ్చి, ఎర్త్ క్లబ్స్ ద్వారా ఔషధవనం, ఇంకుడు గుంతలు, కంపోస్టు పిట్, కిచెన్ గార్డెన్స్, విత్తన బ్యాంకులు ఏర్పాటు చేయించామని వివరించారు.

31న జరిగే వేడుకకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, NABARD, SEBI, NSE-SSC ఉన్నతాధికారులు, పర్యావరణ వేత్తలు ముఖ్య అతిథులుగా హాజరవుతారని, ఉత్తమ YELP పాఠశాలలు, ఉత్తమ మెంటర్ టీచర్లు, ఉత్తమ యంగ్ ఎర్త్ లీడర్స్ ను జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలతో సత్కరించనున్నట్లు తెలిపారు.