BREAKING
రాజకీయ లబ్ధి కోసమే ఈటల పాదయాత్ర: డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్‌ యాదవ్‌ క్లోరెక్స్ కొత్త సీఈఓగా యూనిలీవర్ మాజీ ఎగ్జిక్యూటివ్ పర్యావరణ పునరుద్ధరణ చర్యలను వేగవంతం చేయాలి రాష్ట్ర పండుగను తలపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం.. అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన స్విట్జర్లాండ్ బయోటెక్ దిగ్గజం మాలిక్యులర్ పార్టనర్స్ సంచలన నిర్ణయం ఫోక్స్‌వ్యాగన్‌కు భారత్‌లో రూ. 12 వేల కోట్ల భారీ పన్ను వివాదంపై హైకోర్టులో కొత్త మలుపు! తగ్గేదేలే...! *కార్పొరేషన్ లో పెరిగిన హీట్ గ్రామాల్లో శిక్షణ డిప్యూటీ కలెక్టర్ పరిశీలన ఎన్విడియాకు దీటుగా గూగుల్ ఏఐ చిప్స్ మంథని పుష్కర ఘాట్‌కు రూ.23 కోట్లు ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం స్వతంత్ర అభ్యర్థికి భారీగా మహిళల మద్దతు... బీరువా గుర్తుకే జై కొడుతున్న మహిళా లోకం ఫ్రాన్స్‌ దేశంలో జాత్యహంకారాన్ని ప్రోత్సహిస్తోందంటూ మితవాద పార్టీలపై ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఆగ్రహం! ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతులు

చినమాచనూరులో టిడిపి ప్రచార జోరు

Select Suryaa Now
చినమాచనూరులో టిడిపి ప్రచార జోరు

మర్రిపాడు మేజర్ న్యూస్ :    మర్రిపాడు మండలంలోని చినమాచనూరు సెగ్మెంట్లో తెలుగుదేశంపార్టీ తరుపున పోటీ చేస్తున్న ఎంపీటీసీ అభ్యర్థి ఒంగోలు సుబ్బారెడ్డి గత మూడు రోజులగా ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. ఈ తరుణంలో ఆ ప్రాదేశికంలో ఉన్నటువంటి పోలిరెడ్డిపల్లి, నెర్ధనంపాడు, నాగరాజుపాడు, పెదమాచునూరు, కదిరినేనిపల్లి తదితర గ్రామాల్లో కూటమి ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రచార నేపథ్యంలో ఓటర్ల వద్దకు వెళ్లి ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనతో పాటుగా జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంగినేని ప్రసన్నను గెలిపించాలని ప్రార్థించారు. దీంతోపాటుగా కరపత్రాలను పంపిణీ చేస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తుంటివంటి అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. మర్రిపాడు మండలంలోని అతి పెద్ద సెగ్మెంట్ గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రచారంలో ఆయా గ్రామాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నడంతో టిడిపి అభ్యర్థితో పాటు జడ్పిటిసి అభ్యర్థి కూడా అఖండ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రచారంలో మండల కేంద్ర టిడిపి నాయకులు తెలుగుదేశం పార్టీ మండల రైతు సంఘం నాయకులు మాలపాటి వెంకటేశ్వర్లు, ముప్పాళ్ళ వెంకట చౌదరి, మర్రిపాడు మాజీ సర్పంచ్ మానం వెంకటేశ్వర్లు లతోపాటుగా ఆ సెగ్మెంట్ టిడిపి నాయకులు తమటం ఈశ్వర్ రెడ్డి, కోడూరు బ్రహ్మచారి, తలపనేని శ్రీనివాసులునాయుడు, మాజీ ఎంపీటీసీ ఇoడేలా ఓబుల్ రెడ్డి, మండవ రామ్మోహన్ నాయుడు తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.