BREAKING
పాకిస్తాన్‌లో ప్రముఖ హక్కుల కార్యకర్తల దంపతులకు 10 ఏళ్ల జైలు శిక్ష బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రతిభ నెట్ బాల్ పోటీల నందు అద్భుత ప్రతిభ స్ట్రోక్ వస్తే ప్రతి నిమిషం విలువైనదే.. సకాలంలో చికిత్స అందిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు - డాక్టర్ దాసరి చంద్రశేఖర్ 64వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి నజీమా నౌషాద్‌కు మద్దతుగా విస్తృత ప్రచారం తల్లి అవ్వడం నా జీవితంలో కొత్త దశ.. మళ్లీ వెనక్కి వెళ్లడం ఎందుకు?: నటి కత్రినా కైఫ్! పటాన్‌చెరు నుంచి ఢిల్లీ బాట పట్టిన కాంగ్రెస్ శ్రేణులు YELP వార్షిక పురస్కారాలు 31న - సిద్ధమైన ది ఎర్త్ సెంటర్.. 2030 ఫ్రెంచ్ ఆల్ప్స్ వింటర్ ఒలింపిక్స్ బాధ్యతలు బంగ్లా లో ఉన్నది అసలైన టీడీపీ కాదు...... * మాజీ కౌన్సిలర్ రొంగలి రామారావు * ఆయిల్‌పామ్ తోటల పరిశీలన.. రైతులతో కలెక్టర్ ముఖాముఖి సోరియాసిస్ అనేది అంటువ్యాధి కాదు.. బాధితుల పట్ల సామాజిక వివక్ష తగదు - డాక్టర్ దాసరి చంద్రశేఖర్ లిథువేనియాలో స్టార్‌లింక్ బేస్ స్టేషన్‌పై దాడి కేసులో తీవ్ర పరిణామాలు జోరుగా కూటమి అభ్యర్థుల ప్రచారం -- గడ్డమణుగు రవి కుమార్ ఆధ్వర్యంలో దమ్ముంటే కోలగట్ల పై ఏ కేసులు ఉన్నాయో నిరూపించండి.... * 3 రోజుల్లో నిరూపిస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటా * ప్రధాని పెడ్రో సాంచెజ్ ఎన్నికల ప్రచారానికి భారీ ఎదురుదెబ్బ!

ఎమ్మెల్సీ ఫలితాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ వ్యాఖ్యలు

Select Suryaa Now
ఎమ్మెల్సీ ఫలితాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ వ్యాఖ్యలు

 

 


దేశవ్యాప్తంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు బీజేపీ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నుంచి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ సొంత నగరమైన నాగ్‌పూర్‌, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న లక్నో వరకు బీజేపీకి ఎదురుదెబ్బలు తగలడం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు. గురువారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
వారణాసి టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రమోద్‌ మిశ్రా ఓటమి చెందగా, ఇండియా కూటమిలోని సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి లాల్‌ బిహారీ యాదవ్‌ విజయం సాధించారని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం ఉన్న నాగ్‌పూర్‌లో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి అభిజీత్‌ వంజారి, బీజేపీ అభ్యర్థి సుధాకర్‌ కోహళెపై గెలుపొందారని పేర్కొన్నారు. లక్నోలోనూ సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి కాంతి సింగ్‌ విజయం సాధించగా, పాట్నా టీచర్స్‌ ఎమ్మెల్సీ స్థానాన్ని ఆర్జేడీ అభ్యర్థి సంజీవ్‌ కుమార్‌ కైవసం చేసుకున్నారని వివరించారు.
పుణే గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ స్థానంలో ఎన్‌సీపీ (శరద్‌చంద్ర పవార్‌) అభ్యర్థి హర్షదా దేశ్‌ముఖ్‌ విజయం సాధించారని తెలిపారు. యోగి ఆదిత్యనాథ్‌ సొంత ప్రాంతమైన గోరఖ్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి ధ్రువ్‌ కుమార్‌ త్రిపాఠి కేవలం 307 ఓట్ల మెజారిటీతో గెలిచారని పేర్కొన్నారు. బీజేపీ అగ్రనేతల ప్రభావం ఉన్న ప్రాంతాల్లోనే ఆ పార్టీకి గట్టి పోటీ ఎదురవుతోందని అన్నారు.
ఎన్ని స్థానాలు గెలిచామన్నది కాదు.. ఎక్కడ గెలిచామన్నదే ముఖ్యం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో 28 స్థానాల్లో ఎన్ని గెలిచామని ప్రశ్నిస్తున్న ప్రధాని మోదీ.. ఎక్కడ గెలిచాం, ఎక్కడ ఓడిపోయామన్న విషయాన్ని కూడా పరిశీలించాలని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. నాగ్‌పూర్‌లో కాంగ్రెస్‌ విజయం సాధించడం ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పుగా అభివర్ణించారు. చదువుకున్న యువత, మేధావులు, ఉద్యోగుల్లో బీజేపీ పాలనపై అసంతృప్తి పెరుగుతోందని వ్యాఖ్యానించారు.
కర్ణాటకలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు.. వారణాసి, నాగ్‌పూర్‌లో తమ పార్టీ అభ్యర్థులు ఓడిపోవడంపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ఓటమిని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించే బీజేపీ, వారణాసిలో ఎదురైన ఓటమిని మోదీ పాలనపై ప్రజాభిప్రాయంగా ఎందుకు అంగీకరించడం లేదని నిలదీశారు. బీజేపీకి ఒకచోట ఒక నీతి, మరోచోట మరో నీతి ఉండకూడదని అన్నారు.
మోదీ వైఫల్యాలను అంగీకరించాలి
ప్రధాని మోదీకి నైతికత ఉంటే వారణాసిలో బీజేపీ అభ్యర్థి ఓటమికి బాధ్యత వహించాలని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ప్రధానిగా 12 ఏళ్లు దాటినా మోదీ ఒక్కసారి కూడా విలేకరుల సమావేశం నిర్వహించలేదని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సామాజిక మాధ్యమాల్లో స్పందించడం కాకుండా, నేరుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని సవాల్‌ విసిరారు. బాంకీపూర్‌ నుంచి వారణాసి వరకు బీజేపీకి ఎదురవుతున్న రాజకీయ పరిణామాలు ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందనే సంకేతాలిస్తున్నాయని అన్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల్లో అధికార బలం, కేంద్రంలో ప్రభుత్వం ఉన్నప్పటికీ కీలక స్థానాల్లో ఓటములు ఎదురవడం ఆ పార్టీకి ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు.
రాహుల్‌ గాంధీ నాయకత్వానికి పెరుగుతున్న మద్దతు
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నాయకత్వంలో బీజేపీ వ్యతిరేక శక్తులకు ప్రజా మద్దతు పెరుగుతోందని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌ చేస్తున్న పోరాటానికి ఈ ఎన్నికల ఫలితాలు బలాన్నిస్తున్నాయని పేర్కొన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించి, రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మూడు అంకెల సీట్లకే పరిమితమయ్యే పరిస్థితి వస్తుందని రాజకీయ అంచనా వేశారు.
నవంబర్‌ 1న ఢిల్లీలో భారీ నిరసన
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్‌), ఓటు చోరీ ఆరోపణలపై నవంబర్‌ 1న ఢిల్లీలో రాహుల్‌ గాంధీ నాయకత్వంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా లక్షలాది మంది హాజరవుతారని, తెలంగాణ నుంచి వేలాది మంది తరలివెళ్తారని చెప్పారు. నిరసన కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకాకుండా అడ్డుకునేందుకు బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, ఢిల్లీకి వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడం అందులో భాగమేనని ఆరోపించారు. బీజేపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా కాంగ్రెస్‌ శ్రేణులు వెనక్కి తగ్గబోవని స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఓటర్ల జాబితా నుంచి తొలగించారని కాంగ్రెస్‌ ఆరోపిస్తున్న 13.3 కోట్ల ఓట్లను తిరిగి చేర్చాలని డిమాండ్‌ చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెబుతారని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు.
ఎ.రవీందర్‌ సూర్య తెలంగాణ బ్యూరో ప్రతినిధి