BREAKING
వెటర్నరీ కళాశాలలో మొక్కలు నాటిన రెడ్ క్రాస్ ప్రతినిధులు చినమాచనూరులో టిడిపి ప్రచార జోరు కంపసముద్రంలో పోలేరమ్మ గుడి శంకుస్థాపన శ్రీకాకుళం తీరప్రాంత పరిరక్షణకు పెద్దపీట.. * నష్టపోయిన ప్రతి రైతుకూ అండగా నిలుస్తాం * ఆత్మకూరులో నేడే తెలుగుదేశం, ఎన్ డి ఏ కూటమి ర్యాలీ - రండి.. కదలిరండి.. తరలిరండి... ఎన్నికల నిర్వహణపై సమీక్ష మధ్యవర్తిత్వంతో పెండింగ్ కేసులకు సత్వర పరిష్కారం కూలిన భారీ వృక్షం. స్పందించిన రెవిన్యూ శాఖ * పోలీస్,ఎన్డీఆర్ఎఫ్, ఆర్ అండ్ బి సహకారంతో * ​డాక్టర్‌ పాదర్తి నాగరాజుకు ‘జాతీయ ఉత్తమ జర్నలిస్టు’ పురస్కారం. విదేశాల్లో పుట్టిన వారికి చైర్మన్ పదవా? విచారణ జరపాలి. కావలి డిఎస్‌పి కార్యాలయంలో ఘనంగా రక్తదాన శిబిరం. మల్లన్నసాగర్ కట్టకింద భారీ బ్లాస్టింగ్ 35 వేల ఎకరాల్లో పంట నష్టం.. రైతులకు అండగా కూటమి ప్రభుత్వంప్రతిపక్షాల విమర్శలు విడ్డూరం : ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మక్కువ లో హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీల ప్రచారం ​బోగోలు మండలంలో ముమ్మరంగా ప్రచారం - జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను భారీగా గెలిపించాలంటూ ఎమ్మెల్యే

నవాబుపేటను కరువు మండలంగా ప్రకటించాలి

Select Suryaa Now
నవాబుపేటను కరువు మండలంగా ప్రకటించాలి

*--మెడలకు ఉరితాళ్లతో రైతుల మహాధర్నా.* 

 *-- ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం.* 

 *-- పంట నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్‌.* 

 *-- తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలి.* 

 *-- డిమాండ్‌ నెరవేర్చకపోతే ఉద్యమం ఉధృతం.* 

నవాబుపేట సూర్య న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో నవాబుపేట మండలానికి చోటు కల్పించకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మాడెమోని నర్సింలు,మాజీ జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు మెడలకు ఉరితాళ్లు బిగించుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు.వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయినప్పటికీ ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించకపోవడాన్ని నిరసిస్తూ మహాధర్నా చేపట్టారు.*ఎల్‌నినో ప్రభావంతో వేల ఎకరాల్లో పంట నష్టం* ఈ సందర్భంగా నాయకులు,రైతులు మాట్లాడుతూ..ఎల్‌నినో ప్రభావం,వర్షాభావ పరిస్థితుల కారణంగా మండలంలో వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.పంటల సాగు కోసం రైతులు పెట్టిన పెట్టుబడులు నీటిపాలయ్యాయని,అప్పులు తీర్చే మార్గం లేక అన్నదాతలు తీవ్ర నిరాశ,నిస్పృహలకు గురవుతున్నారని పేర్కొన్నారు.ఇంతటి దయనీయ పరిస్థితుల్లోనూ కరువు మండలాల జాబితాలో నవాబుపేటకు చోటు కల్పించకపోవడం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోందన్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి నవాబుపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.పంట నష్టంపై సమగ్రంగా అంచనా వేసి బాధిత రైతులకు తగిన ఆర్థిక సాయం అందించాలని కోరారు.రైతుల కష్టాలను గుర్తించి ఆదుకోవాల్సిన ప్రభుత్వం,అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు.రైతుబీమా,రైతుబంధు పథకాల అమలు,యూరియా సరఫరా,వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ అందించే విషయంలోనూ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.*డిమాండ్‌ నెరవేర్చకపోతే ఉద్యమం ఉధృతం* నవాబుపేట మండలంలోని రైతుల పరిస్థితిని ప్రభుత్వం తక్షణమే గుర్తించి న్యాయం చేయాలని నాయకులు స్పష్టం చేశారు.కరువు మండలంగా ప్రకటించి పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక భరోసా కల్పించకపోతే రైతుల పక్షాన మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.రైతుల సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.*తహసీల్దార్‌కు వినతిపత్రం* మహాధర్నా అనంతరం నాయకులు,రైతులు ర్యాలీ నిర్వహిస్తూ తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నారు.అనంతరం తహసీల్దార్‌ సురేష్‌కు వినతిపత్రం సమర్పించి,నవాబుపేట మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించి,పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని కోరారు.ఈ మహాధర్నాలో మాజీ ఎంపీపీలు అనంతయ్య,శ్రీనివాస్‌,పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రతాప్‌,మాజీ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పురుషోత్తం,మాజీ వైస్‌ ఎంపీపీ సంతోష్‌రెడ్డి,మాజీ మైసమ్మ చైర్మన్లు గోపాల్‌,కృష్ణయ్య,మాజీ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ చందర్‌నాయక్‌,మాజీ ముడా డైరెక్టర్‌ గండు చెన్నయ్య,గోపాల్‌గౌడ్‌, తాహెర్‌,మెండే అంజయ్య, సర్పంచులు రవీందర్‌,కమలమ్మ కుమార్‌, రంజిత్‌కుమార్‌గౌడ్‌,యాదగిరి,బాలరాజు,బాలకిష్టమ్మరాములు,భీమయ్య,విశాలశివకుమార్‌,సునీతఆంజనేయులు,అనసూయయాదయ్యగౌడ్‌,రాఘవేందర్‌,బాలయ్య,రాములు,మాజీ సర్పంచులు రాజు,సత్యం,యాదయ్య,అబ్దుల్లా,రాములు నాయక్, హన్మంతు,ఉపసర్పంచ్లు,ప్రజాప్రతినిధులు,బీఆర్ఎస్ మండల యువజన అధ్యక్షుడు మెండే శీను,గండు తిరుపతయ్య,శ్రీనివాస్ గౌడ్,నర్సింలు,శ్రీశైలం,మహేష్‌ వివిధ గ్రామాల బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు,పార్టీ శ్రేణులు,అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.