బెజ్జూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఐదుగురు పట్టివేత...
సూర్య బెజ్జుర్:డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్నారనే సమాచారంతో బెజ్జూరు ఎస్సై కె. రమేష్ తన సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు. ఈ దాడిలో శివ ప్రసాద్, శంకర్, గంగయ్య, తిరుపతి, ఓదెలు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 52 పేకముక్కలు, రూ.2,500 నగదు, రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.