BREAKING
స్ట్రోక్ వస్తే ప్రతి నిమిషం విలువైనదే.. సకాలంలో చికిత్స అందిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు - డాక్టర్ దాసరి చంద్రశేఖర్ 64వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి నజీమా నౌషాద్‌కు మద్దతుగా విస్తృత ప్రచారం తల్లి అవ్వడం నా జీవితంలో కొత్త దశ.. మళ్లీ వెనక్కి వెళ్లడం ఎందుకు?: నటి కత్రినా కైఫ్! పటాన్‌చెరు నుంచి ఢిల్లీ బాట పట్టిన కాంగ్రెస్ శ్రేణులు YELP వార్షిక పురస్కారాలు 31న - సిద్ధమైన ది ఎర్త్ సెంటర్.. 2030 ఫ్రెంచ్ ఆల్ప్స్ వింటర్ ఒలింపిక్స్ బాధ్యతలు బంగ్లా లో ఉన్నది అసలైన టీడీపీ కాదు...... * మాజీ కౌన్సిలర్ రొంగలి రామారావు * ఆయిల్‌పామ్ తోటల పరిశీలన.. రైతులతో కలెక్టర్ ముఖాముఖి సోరియాసిస్ అనేది అంటువ్యాధి కాదు.. బాధితుల పట్ల సామాజిక వివక్ష తగదు - డాక్టర్ దాసరి చంద్రశేఖర్ లిథువేనియాలో స్టార్‌లింక్ బేస్ స్టేషన్‌పై దాడి కేసులో తీవ్ర పరిణామాలు జోరుగా కూటమి అభ్యర్థుల ప్రచారం -- గడ్డమణుగు రవి కుమార్ ఆధ్వర్యంలో దమ్ముంటే కోలగట్ల పై ఏ కేసులు ఉన్నాయో నిరూపించండి.... * 3 రోజుల్లో నిరూపిస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటా * ప్రధాని పెడ్రో సాంచెజ్ ఎన్నికల ప్రచారానికి భారీ ఎదురుదెబ్బ! ప్రచారంలో వైసీపీ దూకుడు.. బిట్‌-2లో వాకాటి సంధ్య జోరు! జడ్పిటిసి,ఎంపిటిసి గెలుపు లక్ష్యంగా రాగోలు,గోలగాం గ్రామాలలో విస్తృతంగా ప్రచారం

రాజకీయాలకు అతీతంగా మున్నూరు కాపుల ఐక్యతే లక్ష్యం

Select Suryaa Now
రాజకీయాలకు అతీతంగా మున్నూరు కాపుల ఐక్యతే లక్ష్యం

సూర్య కరీంనగర్‌:మున్నూరు కాపుల జనాభాపై స్పష్టమైన గణాంకాలు సాధించడంతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా కుల బాంధవులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలంగాణ మున్నూరు కాపు సంఘం (పటేల్స్) వ్యవస్థాపక అధ్యక్షుడు కుండ దేవయ్య పటేల్ తెలిపారు. రాజకీయ పార్టీలకు అతీతంగా కుల ఐక్యతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గురువారం కరీంనగర్‌ నగరంలోని రాధా హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాజకీయాలకతీతంగా ఐక్యత రావాలి
రాష్ట్రంలో మున్నూరు కాపులు వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నప్పటికీ, కుల ప్రయోజనాల విషయంలో మాత్రం ఐక్యంగా ఉండాలని దేవయ్య పటేల్ అన్నారు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కంటే సామాజిక అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. గత రెండు దశాబ్దాలుగా మున్నూరు కాపుల సంఘటిత శక్తి కోసం పనిచేస్తున్నానని, ఉమ్మడి పది జిల్లాల నుంచి ప్రస్తుత 33 జిల్లాల వరకు సంఘాల ఏర్పాటు, నాయకత్వ నిర్మాణంలో భాగస్వామినయ్యానని వివరించారు.
జనాభా లెక్కల్లో వ్యత్యాసాలపై ఆవేదన
మున్నూరు కాపుల జనాభా విషయంలో వేర్వేరు సర్వేల్లో భిన్నమైన గణాంకాలు వెల్లడవుతున్నాయని దేవయ్య పటేల్ పేర్కొన్నారు. తమ అంచనా ప్రకారం రాష్ట్రంలో మున్నూరు కాపుల జనాభా సుమారు 51 లక్షలు ఉండగా, గతంలో నిర్వహించిన కుటుంబ సమగ్ర సర్వేలో 28 లక్షలుగా నమోదైందని తెలిపారు. తాజా కులగణనలోనూ తమ జనాభా తక్కువగా నమోదైందని ఆరోపించారు. ఈ గణాంకాలపై స్పష్టత రావాలంటే ప్రతి కుటుంబం సభ్యత్వ నమోదు చేసుకోవాలని కోరారు.
కార్పొరేషన్‌ ఏర్పాటు.. నిధుల విడుదల ఏవీ?
మున్నూరు కాపుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి, తగిన నిధులు కేటాయించాలని ప్రభుత్వాలను కోరుతున్నామని దేవయ్య పటేల్ తెలిపారు. విద్యార్థుల కోసం హాస్టల్‌ భవనం నిర్మాణానికి రెండు ఎకరాల స్థలం, నిధులు కేటాయించాలని గతంలో పలువురు ప్రజాప్రతినిధులు, మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. హామీలు ఇచ్చినా ఆశించిన స్థాయిలో కార్యరూపం దాల్చలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మున్నూరు కాపుల జనాభా, సామాజిక పరిస్థితికి అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.
అన్ని పార్టీల నేతలు స్పందించాలి
రాష్ట్రంలో వివిధ పార్టీల్లో ఉన్న మున్నూరు కాపు ప్రజాప్రతినిధులు తమ సామాజిక వర్గ అభివృద్ధి కోసం సమష్టిగా కృషి చేయాలని దేవయ్య పటేల్ కోరారు. బండి సంజయ్‌, గంగుల కమలాకర్‌, పొన్నం ప్రభాకర్‌, ఆది శ్రీనివాస్‌, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, చల్లా హరిశంకర్  తదితర నాయకులు మున్నూరు కాపుల సమస్యలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయంగా ఎవరు ఏ పార్టీలో ఉన్నా, సామాజిక సమస్యల పరిష్కారం కోసం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.


ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారికీ సభ్యత్వం
తెలంగాణలోనే కాకుండా దేశవిదేశాల్లో నివసిస్తున్న మున్నూరు కాపులందరూ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగస్వాములు కావాలని దేవయ్య పటేల్ పిలుపునిచ్చారు. పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి వివరాలు నమోదు చేయడం ద్వారా సంఘం వద్ద సమగ్ర సమాచారం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఇందుకోసం వెబ్‌సైట్‌ ద్వారా సభ్యత్వ నమోదు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రతి కుటుంబంలోని సభ్యులందరూ సుమారు పది నిమిషాలు కేటాయించి నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు.
సామాజిక హక్కుల సాధనకు సంఘటిత శక్తి
మున్నూరు కాపులు విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక అభివృద్ధి రంగాల్లో మరింత ముందుకు వెళ్లాలంటే ఐక్యత అవసరమని దేవయ్య పటేల్ అభిప్రాయపడ్డారు. గతంలో వేములవాడలో మున్నూరు కాపు సత్రం నిర్మాణం, వివిధ జిల్లాల్లో సంఘాల ఏర్పాటు కోసం కృషి చేసినట్లు గుర్తుచేశారు. భవిష్యత్తులోనూ కుల బాంధవుల సమస్యల పరిష్కారానికి తన వంతు ప్రయత్నం కొనసాగిస్తానన్నారు. సభ్యత్వ నమోదు ద్వారా సంఘటిత శక్తిని పెంపొందించుకుని, సామాజిక హక్కుల సాధనకు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం మున్నూరు కాపు పోస్టర్ను వెబ్సైట్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో సంఘం కమిటీ సభ్యులు కోల అన్నారెడ్డి, ఎర్రం రాజు రెడ్డి,నామిని సత్యనారాయణ కాసరాజు పటేల్ జల్లోజి శ్రీనివాస్, డాక్టర్ సందీప్ పు రెళ్ళ సరోజ, అరుణ,కుంట సుజాత,కుల బాంధవులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.