BREAKING
బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రతిభ నెట్ బాల్ పోటీల నందు అద్భుత ప్రతిభ స్ట్రోక్ వస్తే ప్రతి నిమిషం విలువైనదే.. సకాలంలో చికిత్స అందిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు - డాక్టర్ దాసరి చంద్రశేఖర్ 64వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి నజీమా నౌషాద్‌కు మద్దతుగా విస్తృత ప్రచారం తల్లి అవ్వడం నా జీవితంలో కొత్త దశ.. మళ్లీ వెనక్కి వెళ్లడం ఎందుకు?: నటి కత్రినా కైఫ్! పటాన్‌చెరు నుంచి ఢిల్లీ బాట పట్టిన కాంగ్రెస్ శ్రేణులు YELP వార్షిక పురస్కారాలు 31న - సిద్ధమైన ది ఎర్త్ సెంటర్.. 2030 ఫ్రెంచ్ ఆల్ప్స్ వింటర్ ఒలింపిక్స్ బాధ్యతలు బంగ్లా లో ఉన్నది అసలైన టీడీపీ కాదు...... * మాజీ కౌన్సిలర్ రొంగలి రామారావు * ఆయిల్‌పామ్ తోటల పరిశీలన.. రైతులతో కలెక్టర్ ముఖాముఖి సోరియాసిస్ అనేది అంటువ్యాధి కాదు.. బాధితుల పట్ల సామాజిక వివక్ష తగదు - డాక్టర్ దాసరి చంద్రశేఖర్ లిథువేనియాలో స్టార్‌లింక్ బేస్ స్టేషన్‌పై దాడి కేసులో తీవ్ర పరిణామాలు జోరుగా కూటమి అభ్యర్థుల ప్రచారం -- గడ్డమణుగు రవి కుమార్ ఆధ్వర్యంలో దమ్ముంటే కోలగట్ల పై ఏ కేసులు ఉన్నాయో నిరూపించండి.... * 3 రోజుల్లో నిరూపిస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటా * ప్రధాని పెడ్రో సాంచెజ్ ఎన్నికల ప్రచారానికి భారీ ఎదురుదెబ్బ! ప్రచారంలో వైసీపీ దూకుడు.. బిట్‌-2లో వాకాటి సంధ్య జోరు!

ఇండ్లు త్వరితగతిన పూర్తి చేయాలి..జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం

Select Suryaa Now
ఇండ్లు త్వరితగతిన పూర్తి చేయాలి..జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం

సూర్య..రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి గురువారం మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, హౌసింగ్ ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.జిల్లాలో ఇప్పటివరకు 6,465 ఇండ్లకు ముగ్గు పోశామని, 5,479 ఇండ్లు బేస్‌మెంట్ లెవెల్‌లో, 4,858 గోడల లెవెల్‌లో, 4,585 స్లాబ్ లెవెల్‌లో, 3,934 ఇండ్లు పూర్తయ్యాయని కలెక్టర్ వెల్లడించారు.ముగ్గు పోసిన వారితో పనులు మొదలుపెట్టించాలని, ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. గుడిసెల్లో ఉంటున్న వారికి ఇండ్లు మంజూరు అయ్యాయని, త్వరగా నిర్మాణాలు మొదలుపెట్టాలని సూచించారు.ప్రతి ఎంపీడీఓ ఇండ్ల పురోగతిని పరిశీలించాలని, హౌసింగ్ ఏఈలు ఫోటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని తెలిపారు.ఉత్తమ ప్రతిభ చూపిన బోయినపల్లి, ఇల్లంతకుంట మండలాల అధికారులను కలెక్టర్ అభినందించారు.సమావేశంలో ఇంచార్జి హౌసింగ్ పీడీ ఖాజా ముజాఫరుద్దీన్, జిల్లా పంచాయతీ అధికారి వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు.