BREAKING
పాకిస్తాన్‌లో ప్రముఖ హక్కుల కార్యకర్తల దంపతులకు 10 ఏళ్ల జైలు శిక్ష బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రతిభ నెట్ బాల్ పోటీల నందు అద్భుత ప్రతిభ స్ట్రోక్ వస్తే ప్రతి నిమిషం విలువైనదే.. సకాలంలో చికిత్స అందిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు - డాక్టర్ దాసరి చంద్రశేఖర్ 64వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి నజీమా నౌషాద్‌కు మద్దతుగా విస్తృత ప్రచారం తల్లి అవ్వడం నా జీవితంలో కొత్త దశ.. మళ్లీ వెనక్కి వెళ్లడం ఎందుకు?: నటి కత్రినా కైఫ్! పటాన్‌చెరు నుంచి ఢిల్లీ బాట పట్టిన కాంగ్రెస్ శ్రేణులు YELP వార్షిక పురస్కారాలు 31న - సిద్ధమైన ది ఎర్త్ సెంటర్.. 2030 ఫ్రెంచ్ ఆల్ప్స్ వింటర్ ఒలింపిక్స్ బాధ్యతలు బంగ్లా లో ఉన్నది అసలైన టీడీపీ కాదు...... * మాజీ కౌన్సిలర్ రొంగలి రామారావు * ఆయిల్‌పామ్ తోటల పరిశీలన.. రైతులతో కలెక్టర్ ముఖాముఖి సోరియాసిస్ అనేది అంటువ్యాధి కాదు.. బాధితుల పట్ల సామాజిక వివక్ష తగదు - డాక్టర్ దాసరి చంద్రశేఖర్ లిథువేనియాలో స్టార్‌లింక్ బేస్ స్టేషన్‌పై దాడి కేసులో తీవ్ర పరిణామాలు జోరుగా కూటమి అభ్యర్థుల ప్రచారం -- గడ్డమణుగు రవి కుమార్ ఆధ్వర్యంలో దమ్ముంటే కోలగట్ల పై ఏ కేసులు ఉన్నాయో నిరూపించండి.... * 3 రోజుల్లో నిరూపిస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటా * ప్రధాని పెడ్రో సాంచెజ్ ఎన్నికల ప్రచారానికి భారీ ఎదురుదెబ్బ!

రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంః ముత్తినేని వీరయ్య

Select Suryaa Now
రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంః ముత్తినేని వీరయ్య


 


తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా విస్తృత స్థాయిలో కార్యాచరణ చేపట్టినట్లు కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం చైర్మన్ ముత్తినేని వీరయ్య ప్రకటించారు. నల్లగొండ–వరంగల్–ఖమ్మం, రంగారెడ్డి–హైదరాబాద్–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్రంలోని 77 నియోజకవర్గాలకు 233 మంది ఇన్‌చార్జీలను నియమించినట్లు ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా గురువారం గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను ముత్తినేని వీరయ్య మర్యాదపూర్వకంగా కలిసి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం ఆధ్వర్యంలో చేపడుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాల గురించి వివరించారు.
వికలాంగుల విభాగం కృషిని అభినందించిన మహేష్ కుమార్ గౌడ్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి వికలాంగుల విభాగం చేస్తున్న కృషిని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అభినందించినట్లు ముత్తినేని వీరయ్య తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసి, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించినట్లు పేర్కొన్నారు.
పార్టీ వార్ రూమ్, కనెక్ట్ సెంటర్‌తో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల కార్యాచరణను ముందుకు తీసుకెళ్లాలని, నియోజకవర్గాల వారీగా సభ్యత్వ నమోదు పురోగతిని పర్యవేక్షించాలని సూచించినట్లు తెలిపారు.
ప్రతి ఇన్‌చార్జీ బాధ్యతగా పనిచేయాలి 77 నియోజకవర్గాల్లో ఇన్‌చార్జీలుగా నియమితులైన 233 మంది నాయకులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ముత్తినేని వీరయ్య పిలుపునిచ్చారు. వికలాంగులైన పట్టభద్రుల ఓట్ల నమోదు మాత్రమే కాకుండా, ఇతర పట్టభద్రులనూ గుర్తించి వారి సభ్యత్వ నమోదు కోసం చురుకుగా కృషి చేయాలని సూచించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించేందుకు ప్రతి నియోజకవర్గంలో సమన్వయంతో పనిచేయాలని, అర్హులైన పట్టభద్రులందరికీ సభ్యత్వ నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం శ్రేణుల సమష్టి కృషితో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో పార్టీ విజయానికి బాటలు వేస్తామని ముత్తినేని వీరయ్య ధీమా వ్యక్తం చేశారు.
ఎ.రవీందర్‌ సూర్య తెలంగాణ బ్యూరో ప్రతినిధి