రాజంపేట నుంచి కామారెడ్డికి లైన్మెన్ అహ్మద్ బదిలీ..
సూర్య రాజంపేట:రాజంపేట గ్రామంలో గత ఐదేళ్లుగా లైన్మెన్‌గా విధులు నిర్వహించిన అహ్మద్ కామారెడ్డి కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాజంపేట గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఐదేళ్ల పాటు రాజంపేట గ్రామంలో విధులు నిర్వహించిన సమయంలో తనకు సహకరించిన గ్రామ పెద్దలు, నాయకులు, గ్రామ సర్పంచ్, పత్రికా మిత్రులు, యువకులు, రైతులు, ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. విధుల నిర్వహణలో ప్రతి ఒక్కరూ అందించిన సహకారం మరువలేనిదని పేర్కొన్నారు.
రాజంపేట గ్రామంలో పనిచేసిన కాలంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు లైన్మెన్ అహ్మద్ వెల్లడించారు.