BREAKING
YELP వార్షిక పురస్కారాలు 31న - సిద్ధమైన ది ఎర్త్ సెంటర్.. 2030 ఫ్రెంచ్ ఆల్ప్స్ వింటర్ ఒలింపిక్స్ బాధ్యతలు బంగ్లా లో ఉన్నది అసలైన టీడీపీ కాదు...... * మాజీ కౌన్సిలర్ రొంగలి రామారావు * ఆయిల్‌పామ్ తోటల పరిశీలన.. రైతులతో కలెక్టర్ ముఖాముఖి సోరియాసిస్ అనేది అంటువ్యాధి కాదు.. బాధితుల పట్ల సామాజిక వివక్ష తగదు - డాక్టర్ దాసరి చంద్రశేఖర్ లిథువేనియాలో స్టార్‌లింక్ బేస్ స్టేషన్‌పై దాడి కేసులో తీవ్ర పరిణామాలు జోరుగా కూటమి అభ్యర్థుల ప్రచారం -- గడ్డమణుగు రవి కుమార్ ఆధ్వర్యంలో దమ్ముంటే కోలగట్ల పై ఏ కేసులు ఉన్నాయో నిరూపించండి.... * 3 రోజుల్లో నిరూపిస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటా * ప్రధాని పెడ్రో సాంచెజ్ ఎన్నికల ప్రచారానికి భారీ ఎదురుదెబ్బ! ప్రచారంలో వైసీపీ దూకుడు.. బిట్‌-2లో వాకాటి సంధ్య జోరు! జడ్పిటిసి,ఎంపిటిసి గెలుపు లక్ష్యంగా రాగోలు,గోలగాం గ్రామాలలో విస్తృతంగా ప్రచారం పీఎం శ్రీ బాలుర పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఎంపిక లెనిన్ పాండియన్’ రివ్యూ: పిట్ట కొంచం కూత ఘనం.. అలరించే కామెడీ థ్రిల్లర్! పొటాష్ లోప నివారణకు జిల్లేడు ద్రావణం తయారీ తెలంగాణ కళాకారుల హక్కుల సాధనే లక్ష్యంగా తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ

జైత్వారంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం

Select Suryaa Now
జైత్వారంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం

జైత్వారంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం

55 మందికి పైగా వైద్య పరీక్షలు.. అసంక్రమిత వ్యాధులపై అవగాహన

కందుకూరు : కందుకూరు మండలంలోని జైత్వారం గ్రామంలో గురువారం కందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో అసంక్రమిత వ్యాధుల (ఎన్‌సీడీ) నిర్ధారణ, అవగాహన ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బైరు కొండల్ రెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 55 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించారు.
శిబిరంలో బీపీ, షుగర్‌తో పాటు రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌లపై ప్రజలకు అవగాహన కల్పించారు. వ్యాధులను ముందస్తుగా గుర్తించేందుకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
మెడికల్ ఆఫీసర్ హుమేరా సుల్తానా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ డి. నవీన్ కుమార్, వార్డు సభ్యులు ఓ. సత్యనారాయణ, కె. రాజశేఖర్, ఎస్. మమత మహేందర్, కె. మధు, ఎల్. నవీన్, రేవంత్, ఎస్. అంజయ్య, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.


టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్