BREAKING
దువ్వూరు మండలంలో నేడు 6955 మందికి పింఛన్లు పంపిణీ పోతుగల్ గ్రామం తాండాల్లో ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు రాజకీయాలకు అతీతంగా మున్నూరు కాపుల ఐక్యతే లక్ష్యం ట్రిపుల్ ఇంజన్ సర్కార్‌తోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి : మీడియాతో ఎమ్మెల్యే ఏలూరి హెచ్ ఐవీ నివారణలో భాగస్వాములు కావాలి రాజంపేట నుంచి కామారెడ్డికి లైన్మెన్ అహ్మద్ బదిలీ.. జైత్వారంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం వైసీపీకి గట్టి షాక్.. టీడీపీలోకి చేరికలు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో4 వ వార్డు ఎన్నికల ప్రచారం నారీ లోకానికి గొట్టిపాటి లక్ష్మీ పెద్ద పీట. ఇండ్లు త్వరితగతిన పూర్తి చేయాలి..జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం నష్టపోయిన అరటి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి.తుఫాను వల్ల పడిపోయిన అరటి తోటలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పరిశీలన. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంః ముత్తినేని వీరయ్య సైకిల్‌పై అభ్యర్థి సందడి.. 19వ డివిజన్‌లో షేక్ అహ్మద్ ప్రచార హోరు.. అభ్యర్థి గెలుపే లక్ష్యంగా బెస్త ఆంజనేయులు వ్యూహాత్మక కృషి.. అనురాధ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం..

ప్రజలందరూ ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ద వహించాలి జిల్లా కలెక్టర్ రాజర్షిషా

Select Suryaa Now
ప్రజలందరూ ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ద వహించాలి  జిల్లా కలెక్టర్ రాజర్షిషా

సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి జిల్లాలో వైద్య ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని, ప్రజలందరూ ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. గురువారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని నాగోబా విద్యార్థి నిలయంలో శంకర నేత్రాలయ హైదరాబాద్, వనవాసీ కళ్యాణ్ పరిషత్ (తెలంగాణ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి పొర చికిత్సల ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఆయన ఐటీడీఏ పీవో మంద మకరందు, సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్ తో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్, పిఓ వైద్యులు, రోగులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఆరోగ్యం మెరుగ్గా ఉంటేనే వ్యవసాయం, చదువులు, వ్యాపారాలు అన్ని రంగాలలో రాణించవచ్చని తెలిపారు. ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కేవలం తీవ్రమైన అనారోగ్య సమయాల్లో లేదా చివరి దశలో మాత్రమే ఆర్ఎంపీల వద్దకు వెళ్లే ధోరణిని మార్చుకోవాలని, ప్రాథమిక దశలోనే అర్హులైన ప్రభుత్వ వైద్యులను లేదా నిపుణులను కలవాలని స్పష్టం చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో అక్టోబర్ 31 వరకు కంటి పరీక్షలు నిర్వహించి, నవంబర్ 1 వరకు కంటి ఆపరేషన్లు కొనసాగుతున్నాయని వెల్లడించారు. కేవలం కంటి పరీక్షలు, ఆపరేషన్లే కాకుండా, అవసరమైన వారికి తదుపరి ఫాలో-అప్ సేవలు సైతం పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు. గ్రామీణ ప్రాంత పేదలకు ఇటువంటి సద్వినియోగ శిబిరాలు ఎంతో ప్రయోజనకరమని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ప్రాజెక్ట్ ఆఫీసర్ మంద మకరందు మాట్లాడుతూ.. గ్రామీణ, మారుమూల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇటువంటి మొబైల్ క్యాంపులు ఎంతగానో దోహదపడతాయన్నారు. ప్రత్యేక కంటి వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్న సామాన్యులకు ఈ శిబిరాలు గొప్ప అవకాశమని, ప్రజలు ఆరోగ్యంపై మరింత చైతన్యం కలిగి ఉండాలని అన్నారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో ఇప్పటివరకు 568 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, అందులో 150 మందిని కంటి పొర ఆపరేషన్లకు ఎంపిక చేయగా, నిన్నటివరకు 30 మందికి, ఈరోజు మరో 30 మందికి విజయవంతంగా ఆపరేషన్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు కలెక్టర్‌కు వివరించారు. 
ఈ కార్యక్రమంలో వనవాసీ కళ్యాణ్ పరిషత్ కార్యకర్తలు సిడామ్ భీమ్రావు, హెచ్.కె. నాగు, ప్రకాష్, అజయ్, శంకర నేత్రాలయ కోఆర్డినేటర్ రాజు, వైద్యులు, స్థానిక సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.