ఎసిబి వలలో మోసం గ్రామ పంచాయతీ జీపీఓ శ్రీనివాస్
సూర్య, కాగజ్‌నగర్:కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. మోసం గ్రామ పంచాయతీ జీపీ ఓ శ్రీనివాస్ రూ.22 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ మధు ఆధ్వర్యంలోని బృందం పట్టుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో తహసీల్దార్ కార్యాలయంలో కలకలం రేగింది.