telangana
పలు గ్రామాల్లో కేతి బచాఓ అవగాహన కార్య క్రమాలు
సూర్య భీమిని : మండలంలోని లక్ష్మీపూర్, అక్కలపల్లి గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం కేతి బచావో కార్యక్రమం నిర్వహించారు. భూసారాన్ని కాపాడుకునే పద్ధతులు, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో సాగు చేయాల్సిన ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, సబ్సిడీపై అందించే విత్తనాలు, పురుగుమందుల వివరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రజిత, పశువైద్యాధికారి దిలీప్, ఏఈఓ సుప్రజ, గ్రామ కార్యదర్శి చంద్రగిరి కళ్యాణ్, ఆధ్యరం లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు..కేతి బచ్చావో పిలుపుతో చే పట్టిన కార్యక్రమాలలో పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.