BREAKING
గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలి వివిధ జిల్లాల్లో మద్దతు తీర్మానాలు.. రాష్ట్ర ప్రభుత్వానికి నాయకుల అభ్యర్థన దువ్వూరు మండలంలో నేడు 6955 మందికి పింఛన్లు పంపిణీ పోతుగల్ గ్రామం తాండాల్లో ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు రాజకీయాలకు అతీతంగా మున్నూరు కాపుల ఐక్యతే లక్ష్యం ట్రిపుల్ ఇంజన్ సర్కార్‌తోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి : మీడియాతో ఎమ్మెల్యే ఏలూరి హెచ్ ఐవీ నివారణలో భాగస్వాములు కావాలి రాజంపేట నుంచి కామారెడ్డికి లైన్మెన్ అహ్మద్ బదిలీ.. జైత్వారంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం వైసీపీకి గట్టి షాక్.. టీడీపీలోకి చేరికలు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో4 వ వార్డు ఎన్నికల ప్రచారం నారీ లోకానికి గొట్టిపాటి లక్ష్మీ పెద్ద పీట. ఇండ్లు త్వరితగతిన పూర్తి చేయాలి..జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం నష్టపోయిన అరటి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి.తుఫాను వల్ల పడిపోయిన అరటి తోటలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పరిశీలన. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంః ముత్తినేని వీరయ్య

కొమురం భీమ్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా

Select Suryaa Now
కొమురం భీమ్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా

 సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన వీర యోధుడు కొమురం భీమ్‌కు జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఘనంగా నివాళులర్పించారు. గురువారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కొమురం భీమ్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఐటీడీఏ పీవో మంద మకరందు, సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్‌తో కలిసి కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కొమురం భీమ్ ఆశయాలు, ఆదివాసీల హక్కుల సాధన కోసం ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. ఆదివాసీ సమాజ అభ్యున్నతి, గిరిజనుల హక్కుల పరిరక్షణలో కొమురం భీమ్ పోరాట స్ఫూర్తి ఎప్పటికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో మహేందర్, ఎంపీవో సంజీవ్ రావు, కొమురం భీమ్ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు మెస్రం నాగ్‌నాథ్, కేస్లాపూర్ రాయిసెంటర్ సార్‌మెడి మెస్రం వెంకటరావు పటేల్, గిన్నేరా రాయిసెంటర్ సార్‌మెడి మెస్రం దుర్గ, ఇంద్రవెల్లి సర్పంచ్ రాథోడ్ మోహన్ సింగ్, ఏఎంసీ చైర్మన్ ముకాడే ఉత్తమ్, ఆదివాసీ నాయకులు పూర్కా చిత్రు, కనక తుకారామ్, జుగాదిరావు, గేడం భరత్, సుంకట్ రావు, పలువురు ప్రజాప్రతినిధులు, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.