BREAKING
ఓటమి భయమే భారత్‌ను వెనక్కి లాగుతోంది.. 'రామాయణ' నటుడు కుణాల్ కపూర్ కీలక వ్యాఖ్యలు! ఫీజుల బకాయిలు 8500 కోట్లు ఇచ్చేది ఎప్పుడు..? బీసీ నేత, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య పంట నష్టం పరిశీలించిన ఎమ్మెల్యే బండారు ఎమ్మెల్సీ ఓటరు నమోదు దరఖాస్తుల ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి అన్నూ కపూర్ కామెంట్స్‌పై తమన్నా కౌంటర్.. ‘అలాంటి వ్యాఖ్యలను అస్సలు పట్టించుకోను’! పకృతి వ్యవసాయం రైతులకు మేలు వైసీపీ నుంచి టీడీపీలోకి 100 కుటుంబాలు చేరిక రవాణా శాఖ కార్యదర్శిగా ఇలంబర్తి బాధ్యతల స్వీకరణః మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు నేలతల్లిని కాపాడుకుందాం.. సుస్థిర వ్యవసాయానికి బాటలు వేద్దాం : ఏఓ సుదర్శన్ గౌడ్ తూముకుంటలో కూటమి నేతల ఎన్నికల ప్రచారం 58వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ కంబాలపల్లి ఎంపీటీసీగా తిక్కమ్మనేని మంజుల ఏకగ్రీవం కూటమి పాలనలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి గండిగూడెంలో కూటమి అభ్యర్థుల ఇంటింటా ప్రచారం ఎంపీటీసీ-2 అభ్యర్థి శీలం వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ అభ్యర్థి కూరపాటి సుజాతకు మద్దతుగా ప్రచారం

నందివాడలో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి పేయ్యల అశోక్ విస్తృత ప్రచారం

Select Suryaa Now
నందివాడలో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి పేయ్యల అశోక్ విస్తృత ప్రచారం

నందివాడ, మేజర్ న్యూస్: నందివాడ గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి పేయ్యల అశోక్ విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీటీసీ అభ్యర్థి పేయ్యల గ్రేసమ్మతో కలిసి గ్రామంలోని ప్రతి గడపకూ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారికి గ్రామ ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం, మాజీ మంత్రి కొడాలి నాని తమపై ఉంచిన నమ్మకాన్ని రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా నిలబెట్టుకుంటామని అశోక్ ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. “చెప్పాం.. చేస్తున్నాం” అని చెబుతున్న చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఎంతవరకు అమలు చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు చేసిన కుట్రలు, మోసాలను ప్రజలు గ్రహించారని, కూటమి ప్రభుత్వ పాలనపై అసంతృప్తితో ఉన్నారని అన్నారు. గతంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంపై “బాదుడే బాదుడు” అంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసిన చంద్రబాబు, నేడు అంతకంటే ఎక్కువగా ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు. గతంలో రూ.1,600 ఉన్న బియ్యం కట్ట ధర ప్రస్తుతం రూ.2,100కు చేరుకుందని, దీన్నిబట్టి పేద ప్రజలపై ఎంత భారం పడుతోందో అర్థమవుతోందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయలేని పరిస్థితిలో పేదలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రతి పేదవారి ఇంటికీ సంక్షేమ పథకాలు నేరుగా అందాయని గుర్తుచేస్తూ, ఆ సంక్షేమ పథకాలు మళ్లీ ప్రజలకు అందాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. తెలుగుదేశం పార్టీ పాలనకు స్వస్తి పలికి, రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర, పట్టణ, గ్రామ నాయకులు, మాజీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, వార్డు సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, గుడివాడ నియోజకవర్గం, కృష్ణాజిల్లా.