వచ్చే ఏడాది మార్చికి రైల్వే కోచ్ వర్క్ షాప్ ఫ్యాక్టరీ ప్రారంభం... ఎంపీ బస్తిపాటి నాగరాజు
కర్నూలు మేజర్ న్యూస్:
కర్నూలు జిల్లా పంచలింగాల వద్ద నిర్మిస్తున్న రైల్వే కోచ్ వర్క్ షాప్ ఫ్యాక్టరీ వచ్చే ఏడాది మర్చి లో ప్రారంభం కాబోతున్నట్లు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు...రైల్వే కోచ్ వర్క్ షాప్ ఫ్యాక్టరీని తనిఖీ చేసిన ఆయన , ఫ్యాక్టరీ లో జరుగుతున్న నిర్మాణ పనుల గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు...ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ ఇటీవల జరిగిన రైల్వే అధికారులు, ఎంపీ ల సమావేశంలో భాగంగా రైల్వే కోచ్ వర్క్ షాప్ పురోగతి పై చర్చించడం జరిగిందని, అందులో భాగంగా వర్క్ షాప్ ఫ్యాక్టరీని వచ్చే సంవత్సరం మర్చి లో ప్రారంభించి, మొదటి దశ నాన్ ఏసి కోచ్ రిపేర్ పనులను చేపడతామని రైల్వే ఉన్నతాధికారులు వెల్లడించారన్నారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా స్థానికంగా దాదాపు 1,000 మందికి పైగా ప్రత్యక్షంగా, అనుబంధ పరిశ్రమల ద్వారా మరో 3,000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు...