BREAKING
పోతుగల్ గ్రామం తాండాల్లో ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు రాజకీయాలకు అతీతంగా మున్నూరు కాపుల ఐక్యతే లక్ష్యం ట్రిపుల్ ఇంజన్ సర్కార్‌తోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి : మీడియాతో ఎమ్మెల్యే ఏలూరి హెచ్ ఐవీ నివారణలో భాగస్వాములు కావాలి రాజంపేట నుంచి కామారెడ్డికి లైన్మెన్ అహ్మద్ బదిలీ.. జైత్వారంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం వైసీపీకి గట్టి షాక్.. టీడీపీలోకి చేరికలు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో4 వ వార్డు ఎన్నికల ప్రచారం నారీ లోకానికి గొట్టిపాటి లక్ష్మీ పెద్ద పీట. ఇండ్లు త్వరితగతిన పూర్తి చేయాలి..జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం నష్టపోయిన అరటి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి.తుఫాను వల్ల పడిపోయిన అరటి తోటలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పరిశీలన. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంః ముత్తినేని వీరయ్య సైకిల్‌పై అభ్యర్థి సందడి.. 19వ డివిజన్‌లో షేక్ అహ్మద్ ప్రచార హోరు.. అభ్యర్థి గెలుపే లక్ష్యంగా బెస్త ఆంజనేయులు వ్యూహాత్మక కృషి.. అనురాధ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం.. ఎల్‌ఏ ప్రిమియర్ తర్వాత ‘రామాయణ’పై ప్రశంసల వర్షం.. అన్యుపమ్ ఖేర్ తీవ్ర భావోద్వేగం!

రైతులకు నష్ట నివారణకు సూచనలు

Select Suryaa Now
రైతులకు నష్ట నివారణకు సూచనలు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంఅర్నాబ్ తుపాను ప్రభావంతో పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో రైతులకు అండగా నిలిచి, పంటల నష్ట నివారణ, పునరుద్ధరణ చర్యలపై అవగాహన కల్పించేందుకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ కళాశాల, రాజమహేంద్రవరం అధ్యాపకులు, విద్యార్థులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి డా. పి.వి. సత్యనారాయణ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

జిల్లాలోని తొర్రేడు, కాతేరు , బలబద్రపురం, బిక్కవోలు, వెంకటాపురం, కొప్పవరం తదితర ప్రాంతాల్లో పంటలను పరిశీలించిన అధ్యాపకులు, శాస్త్రవేత్తలు రైతులకు పంటల సంరక్షణ, నష్ట నివారణ, తిరిగి పంటలను పునరుద్ధరించేందుకు చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు విద్యార్థులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేశారు. అధ్యాపకులు, విద్యార్థులను బృందాలుగా విభజించి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ పంటల పరిస్థితిని అంచనా వేశారు. పంటలను తిరిగి కోలుకునేలా చేసేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించి, వాటిని అమలు చేయాలని రైతులకు సూచించారు.

తుపాను ప్రభావంతో వరి పంటతో పాటు ఉద్యాన పంట అయిన అరటి కూడా దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ డా. కె.వి. రమణమూర్తి మాట్లాడుతూ ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని నిలబడగల పంట రకాలను ఎంపిక చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో తుపాను నష్టాలను కొంతవరకు తగ్గించుకోవచ్చని తెలిపారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో పంటల పరిస్థితిని బట్టి వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకు తగిన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

పర్యటనలో కళాశాల అధ్యాపకులు డా. ప్రవీణ, డా. దక్షిణామూర్తి, డా. విజయకృష్ణ, డా. సుధాకర్, డా. అనూష, డా. సునీత, డా. విశాలాక్షి దేవి, విద్యార్థులు, డాట్ సెంటర్, ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.