చేర్యాల వెంకటసాయి ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స
చేర్యాల వెంకటసాయి ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స
3.75 కిలోల భారీ గర్భాశయ ఫైబ్రాయిడ్ తొలగింపు.. రోగి ఆరోగ్యం నిలకడగా
చేర్యాల: పట్టణంలోని వెంకటసాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఆసుపత్రికి చెందిన డాక్టర్ కృష్ణ శ్రావ్య 3.75 కిలోల భారీ గర్భాశయ ఫైబ్రాయిడ్‌ను శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ గోపాల్ రెడ్డి తెలిపారు.చేర్యాల మండలానికి చెందిన ఓ మహిళ భారీ గర్భాశయ ఫైబ్రాయిడ్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చేరగా, వైద్య పరీక్షల అనంతరం గురువారం శస్త్రచికిత్స నిర్వహించినట్లు వెల్లడించారు. శస్త్రచికిత్స విజయవంతం కావడంతో రోగి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ వైద్యులు, ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.మహిళల ఆరోగ్య సమస్యలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఆసుపత్రి పనిచేస్తోందని డాక్టర్ గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆధునిక వైద్య విధానాలతో స్థానిక ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. భారీ ఫైబ్రాయిడ్‌ను విజయవంతంగా తొలగించిన డాక్టర్ కృష్ణ శ్రావ్యకు పలువురు అభినందనలు తెలియజేశారు.