రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు
పులివెందుల మేజర్ న్యూస్:
పులివెందుల మండల పరిధిలోని అంబకపల్లె రింగ్ రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి.
ఎర్రబల్లె హరిజనవాడ గ్రామానికి చెందిన రమేష్, నక్షత్రమ్మ ద్విచక్ర వాహనంపై పనుల నిమిత్తం పులివెందులకు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అంబకపల్లె రింగ్ రోడ్డు సమీపంలో తాడిపత్రి నుంచి బెంగళూరుకు వెళ్తున్న సిమెంట్ లారీ వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో రమేష్, నక్షత్రమ్మ గాయపడ్డారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పులివెందుల కడప రోడ్డులోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పి కృష్ణ. పులివెందుల స్టాప్ రిపోర్టర్ కడప జిల్లా