BREAKING
ఇంకుడు గుంతల వల్ల భూమిలో నీటి నిల్వ పెరుగుతుంది - ఎంపీడీవో తాహీరా బేగం ఫోక్స్ అవగాహన కార్యక్రమం ఎల్ వి ప్రసాద్ లో డయాబెటిక్ రెటినోపతి పై అవగాహన ఇందిరమ్మ గృహాలకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ 31 నుండి గీతంలో సౌత్ జోన్ ఇంటర్-యూనివర్సిటీ పురుషుల టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ పోటీలు వ్యవసాయ పరిశోధనలకు భారత్ లో ప్రతిష్టాత్మక ఐకార్-సీజీఐఏఆర్ సైన్స్ అండ్ పార్టనర్‌షిప్ వీక్‌ నిర్వహణ! ఆస్కార్ అర్హత సాధించిన 'వి వర్ హియర్' షార్ట్ ఫిల్మ్‌తో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా జతకట్టిన ప్రియాంక చోప్రా! ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం - జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు అధికారులు గ్రామాల్లో విస్తృత పర్యటన పిల్లలను కట్టిపడేస్తున్న యానిమేటెడ్ బ్యాక్‌గ్రౌండ్స్ సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి విరాళాల వెల్లువ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి,సీనియర్ సివిల్ జడ్జి గోపిక నాగ శ్రావ్య తప్పిపోయిన ప్రైవేట్ హెలికాప్టర్.. రంగంలోకి దిగిన సైన్యం, ఎస్డీఆర్‌ఎఫ్ రెస్క్యూ బృందాలు! పేలవంగా సాగిన మండల సర్వసభ్య సమావేశం! బనస్కాంతలో రూ.14 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం

తిమ్మాపూర్‌ను వెంటనే కరువు మండలంగా ప్రకటించాలి

Select Suryaa Now
తిమ్మాపూర్‌ను వెంటనే కరువు మండలంగా ప్రకటించాలి

సూర్య తిమ్మాపూర్: పంటలు ఎండిపోయి, తీవ్ర నీటి ఎద్దడితో అల్లాడుతున్న తిమ్మాపూర్ మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. మండల బీజేపీ అధ్యక్షుడు చింతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌–రాజీవ్‌ రహదారిపై తహసీల్దార్ కార్యాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కరువు పరిస్థితులతో రైతులు సాగుకు దూరమవుతున్నా తిమ్మాపూర్‌ను కరువు మండలాల జాబితాలో చేర్చకపోవడం అన్యాయమన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని కోరారు. ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించి, ప్రత్యామ్నాయ సాగునీటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.