ఆలూరు గ్రామపంచాయతీ పాలకమండలి మీటింగ్ రద్దు
ప్రోటోకాల్ విస్మరిస్తూ.. సమస్యలపై సర్పంచ్, ఉప సర్పంచ్ స్పందిస్త లేరని సభ్యుల ఆరోపణ
చేవెళ్ల : ఆలూరు గ్రామంలో ప్రతి నెల జరిగే గ్రామ పంచాయతీ పాలకమండలి మీటింగ్ రద్దయింది. గ్రామంలో నెలకొన్న సమస్యలపై సర్పంచ్, ఉప సర్పంచ్ తో సభ్యుల వాగ్వాదం జరగడమే ప్రధాన కారణమని తెలుస్తుంది. పంచాయతీ పాలకమండలి సభ్యుల విషయంలో ప్రోటోకాల్ విస్మరించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని సభ్యులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని కొన్ని వార్డుల అభివృద్ధికి సహకరించడం లేరని వార్డు సభ్యులు మీటింగ్ను బై కట్ చేశారు. 13వ వార్డులోని తూర్పాటి మల్లయ్య ఇంటివద్ద ఉన్న పాత బోరుబావిలో కొత్త మోటర్ పైపులు దింపి వాస్తవ బిల్లుకు బదులు ఎక్కువ బిల్లు అధికారులకు పంపి అవినీతికి పాల్పడుతున్నారని వార్డు సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఎంపీడీవో కు ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు.