వెల్దుర్తి 1వ ఎంపీటీసీకి ‘త్రిముఖ’ పోరు...!
రంగంలోకి జనసేన, బీఎస్పీ, ఇండిపెండెంట్ అభ్యర్థి .…
ఎవరి ఖాతాలోకి జమ కానుందో వేచి చూడాల్సిందే...?
సానుకూల పవనాలు జనసేన వైపే అంటున్న ప్రజలు...?
వెల్దుర్తిసూర్య ప్రతినిధి రూలర్ మేజర్ న్యూస్: వెల్దుర్తి ఒకటో వార్డు (ఎంపీటీసీ-1) స్థానిక సంస్థల ఎన్నికల సమరం ఉత్కంఠగా మారింది. ఇక్కడ ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా బరిలో నిలవడంతో పోటీ త్రిముఖంగా జనసేన, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)తో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తుండటంతో ఓటర్లు తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండబోతోందనేది తీవ్ర ఆసక్తి కలిగిస్తోంది.హోరాహోరీగా సాగుతున్న స్థానిక సంస్థలఎన్నికల ప్రచారం 1,2,3,4,5, వార్డులో రాజకీయ వేడి ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధానంగా జనసేన పార్టీ తరపున కూటమి నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా పాల్గొనర అనేది సందిగత లో ఉన్నారు. బీఎస్పీ,ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ స్థానిక సమస్యల పరిష్కారం, గ్రామాభివృద్ధి ధ్యేయంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు బీఎస్పీ అభ్యర్థి సామాజికవర్గాల ఓట్లను నిలబెట్టుకునేందుకు శ్రమిస్తుండగా, ఇండిపెండెంట్ అభ్యర్థి ఇంటింటికి యువతతో కలిసి తిరుగుతూ కత్తెర గుర్తుకు ఓటు వేయాలని స్థానిక సంబంధాలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు.
జనసేన వైపే పట్టణ ప్రజల మొగ్గు...?
వార్డులలోని ప్రజల సమస్యలపై అధికారులను నిలదీయడం గత కొంతకాలంగా ప్రజల్లోనే ఉంటూ చేసిన అభివృద్ధి కార్యక్రమాల కారణంగా వార్డు ప్రజల నుంచి జనసేన అభ్యర్థికి విశేష స్పందన లభిస్తోందని క్షేత్రస్థాయిలో ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా యువత, మహిళా ఓటర్లలో జనసేన పట్ల సానుకూలత వ్యక్తమవుతోందని, పట్టణ ప్రజలు ఎక్కువ భాగం జనసేన అభ్యర్థి వైపే మొగ్గు చూపుతున్నట్లు జనసేన పార్టీ (గ్లాస్ గుర్తుపై) ఓటు వేయ గలరని నాయకంటి బాబ్జి ఓటర్ మహాను బావులను కోరడమైనదన్నారు.
సూర్య ప్రతినిధి కే రాజశేఖర్ కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం