ప్రజలు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ లావుడియా శ్రీదేవి
మేడ్చల్ ,మేజర్ న్యూస్ :ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరంగవరంలో ప్రజల సౌకర్యార్థం ఆక్సీవిజన్ లేజర్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో గురువారం వార్డు కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరం ద్వారా స్థానిక ప్రజలకు కంటి పరీక్షలు చేయించుకునే అవకాశం కల్పించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ లావుడియా శ్రీదేవి పాల్గొని ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలు తమ కంటి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ఉచితంగా నిర్వహిస్తున్న ఇలాంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సద్ది సురేష్ రెడ్డి, ఓం ప్రకాష్, వరలక్ష్మి, సురేందర్, దాది నరసింహ, చిన్నోళ్ల భాస్కర్,తదితరులు పాల్గొన్నారు.