భూ పునఃసర్వే పనులు గడువులోగా పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
సూర్య - సుల్తానాబాద్: భూ పునఃసర్వే పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. గురువారం సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్.. కార్యాలయ రికార్డులు, భూ భారతి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను పరిశీలించారు. భూ పునఃసర్వే మొదటి విడతలో ఎంపిక చేసిన గ్రామాల్లో పనులను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని, ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. భూ భారతి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు భూ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు.
ఈ పర్యటనలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ వనజ, తహసీల్దార్ బషిరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.