కొండపల్లి అభివృద్ధికి కృషి చేస్తా: కన్నెకంటి అమూల్య
కొండపల్లి, మేజర్ న్యూస్: కొండపల్లి మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని కూటమి బలపరిచిన టీడీపీ చైర్మన్ అభ్యర్థి కన్నెకంటి అమూల్య తెలిపారు. కూటమి నాయకులతో కలిసి కొండపల్లి మున్సిపాలిటీలో ఆమె విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. తనపై నమ్మకంతో చైర్మన్ అభ్యర్థిగా అవకాశం కల్పించిన స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌కు, కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో కొండపల్లి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, 40 వార్డుల్లోనూ సమాన అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కొండపల్లి బొమ్మలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపును దృష్టిలో ఉంచుకుని పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే మున్సిపాలిటీలోనూ కూటమి అభ్యర్థులు గెలవాలని పేర్కొన్నారు. నవంబర్ 1న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనతో పాటు వార్డుల నుంచి పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని కన్నెకంటి అమూల్య ప్రజలను కోరారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మైలవరం నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా.