అంగన్వాడీ భవనం ప్రారంభించి, చిన్నారులకు అక్షరాభ్యాసం చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి
సూర్య తిమ్మాపూర్ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్‌లో ఉపాధి హామీ, ఐసీడీఎస్, జడ్పీ నిధులు రూ.12 లక్షలతో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించడంతో పాటు గర్భిణులకు ఏర్పాటు చేసిన శ్రీమంతం కార్యక్రమంలో పాల్గొని వారిని ఆశీర్వదించారు. గర్భిణులకు పండ్లు, వస్త్రాలు, మందులను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గర్భిణులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారం ఎంతో ప్రయోజనకరమని తెలిపారు. గర్భిణులు పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవడం వల్ల తల్లుల ఆరోగ్యంతో పాటు పుట్టబోయే శిశువుల ఎదుగుదలకు దోహదపడుతుందన్నారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించడం వారి శారీరక, మానసిక ఎదుగుదలకు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. తల్లులు, పిల్లల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు.
మహాత్మానగర్‌లో ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని స్థానిక సర్పంచ్, సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. గ్రామంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మహాత్మానగర్ సర్పంచ్ పొన్నాల సంపత్, జిల్లా మహిళా సంక్షేమాధికారి దేవసాని సరస్వతి, తహసీల్దార్ కర్ర శ్రీనివాస్ రెడ్డి, సీడీపీవో శ్రీలత, ఏసీడీపీవో సాయి గీత, మండల వైద్యాధికారి డాక్టర్ రామారావు,ఏఎన్ఎం కవితారాణి, వైద్య సిబ్బంది నిర్మల, సుజాత, కె.అంజలి ,ఉప సర్పంచ్ కేతిరెడ్డి ఎల్లారెడ్డి, ప్యాక్స్ చైర్మన్లు గోపు తిరుపతిరెడ్డి, మోరపల్లి రమణారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేశ్, పార్టీ నాయకులు కుంట రాజేందర్ రెడ్డి, గంకిడి లక్ష్మారెడ్డి, పోలు రాము,రమేశ్, బుధారపు శ్రీనివాస్, కొత్త తిరుపతిరెడ్డి, మామిడి అనిల్ కుమార్, గోపు మల్లారెడ్డి, కిరణ్ గౌడ్, అయితం వెంకన్న, రాచమల్ల సరిత, దుర్గాప్రసాద్, గంగరాజం, కనకమల్లు, స్పందన, రాజేందర్ ,ఎడ్ల అర్చన అంజిరెడ్డి, బోయిని వెంకటేశం, పొన్నాల లాస్య,తిరుపతి, గూడ కమలాకర్,అట్ల అనిల్ కుమార్, పోతుగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
చేపల కాలనీలో ముదిరాజ్ సంఘ భవనం ప్రారంభంకరీంనగర్ నగరపాలక సంస్థ 8వ డివిజన్ పరిధిలోని చేపల కాలనీలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన ముదిరాజ్ సంఘ భవనాన్ని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ భవనాలు సామాజిక ఐక్యతకు, ప్రజల పరస్పర సహకారానికి వేదికలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.అనంతరం మహాత్మనగర్ గ్రామంలో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు.