telangana
అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ చేసిన మేరా యువ భారత్ ప్రతినిధులు
సూర్య జైనూర్ : మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలోని మేరా యువ భారత్ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు షేక్ మజీద్ ఆధ్వర్యంలో గురువారం సిర్పూర్ మండల కేంద్రంలో అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు. జీవితంలోని అన్ని రంగాల్లో నీతి, చట్టబద్ధ పాలనను పాటించాలని, లంచం ఇవ్వడం, తీసుకోవడం చేయకూడదని, ప్రతి పనిని నిజాయితీగా, పారదర్శకంగా నిర్వహించాలని ప్రతిజ్ఞ చేశారు. ప్రజా ప్రయోజనాలకు కృషి చేస్తూ, అవినీతి ఘటనలను సంబంధిత అధికారులకు తెలియజేయాలని ప్రతినబూనారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కనకా ఆనంద్, పటేల్ శ్రీరావు, ఉపసర్పంచ్ రామారావు, సామాజిక కార్యకర్త ఆరిఫ్,యూత్ అధ్యక్షులు ఆత్రం హనుమంతరావు,సుధాకర్, జూగాది రావు,బాపు రావు, దేవు రావ్,బల్లు,తదితరులు పాల్గొన్నారు.