పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి
పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి
పార్టీ శ్రేణులు పట్టభద్రుల ఓటరు నమోదుపై దృష్టి సారించాలి
బీఆర్‌ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు వనపర్తి భద్రీనాథ్ గుప్తా
మంచాల: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా పార్టీ నాయకులు కృషి చేయాలని బీఆర్‌ఎస్ యువజన విభాగం మంచాల మండల అధ్యక్షుడు వనపర్తి భద్రీనాథ్ గుప్తా, లోయపల్లి మాజీ సర్పంచ్ నారీ యాదయ్య పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకుని, అర్హులెవరూ ఓటు హక్కుకు దూరం కాకుండా చూడాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర యువ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి ఆదేశాల మేరకు గురువారం మంచాల మండలం అంబోత్ తండలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఉమ్మడి రంగారెడ్డి–మహబూబ్‌నగర్–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వచ్చే నెల 6వ తేదీలోపు అర్హులైన పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేయించేందుకు పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామాల్లోని పట్టభద్రులను గుర్తించి, ఓటరు నమోదుకు అవసరమైన వివరాలపై అవగాహన కల్పించాలని భద్రీనాథ్ గుప్తా కోరారు. పార్టీ శ్రేణులంతా సమష్టిగా పనిచేస్తూ ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ అంబోత్ సుమన్ నాయక్, బీఆర్‌ఎస్ నాయకులు సబావత్ రాజు, అంబోత్ గోపి, కిషన్, సిద్ధు, లక్‌పతి, హతీరామ్, జాటోత్ రాజ్‌కుమార్, అంబోత్ రాజు, మంగత, పవన్, నేనావత్ చిన్న తదితరులు పాల్గొన్నారు.
✍️ఎర్ర లింగం, మేజర్ న్యూస్, మంచాల